కొత్తలుక్‌లో ‘మహానటి’.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఇప్పటివరకు ప్రతి మూవీలో బొద్దుగా కనిపించిన మహానటి కీర్తి సురేష్.. ఇటీవల కాలంలో ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టేసింది. సినిమా కోసం తగ్గాలనుకుందో.. లేక ఎవరినైనా ఇన్ఫిరేషన్‌ తీసుకొని తగ్గాలనుకుందో తెలీదు గానీ ఈ భామ మాత్రం ఒళ్లును భారీగా తగ్గించేసింది. అసలు ఆమె ఎంత బరువు తగ్గిందంటే.. ‘‘ఈమె మన కీర్తి సురేష్‌నా.. నో అనుకునేలా’’. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కీర్తి సురేశ్ ఓ ఫొటో షేర్ చేయగా.. దానికి అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరేమో నైస్ లుక్ […]

కొత్తలుక్‌లో ‘మహానటి’.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

Edited By:

Updated on: Jun 15, 2019 | 7:03 PM

ఇప్పటివరకు ప్రతి మూవీలో బొద్దుగా కనిపించిన మహానటి కీర్తి సురేష్.. ఇటీవల కాలంలో ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టేసింది. సినిమా కోసం తగ్గాలనుకుందో.. లేక ఎవరినైనా ఇన్ఫిరేషన్‌ తీసుకొని తగ్గాలనుకుందో తెలీదు గానీ ఈ భామ మాత్రం ఒళ్లును భారీగా తగ్గించేసింది. అసలు ఆమె ఎంత బరువు తగ్గిందంటే.. ‘‘ఈమె మన కీర్తి సురేష్‌నా.. నో అనుకునేలా’’. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కీర్తి సురేశ్ ఓ ఫొటో షేర్ చేయగా.. దానికి అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరేమో నైస్ లుక్ అంటూ కామెంట్లు పెడుతుండగా.. మరికొందరమో మీ మునుపటి క్యూట్‌నెస్‌ను మిస్ అవుతున్నాం అంటూ బాధగా ఉండే ఎమోజీలను పెడుతున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో  హీరోయిన్లకు నాజుకుగా మారడం ట్రెండ్‌గా మారింది. రకుల్ ప్రీత్ సింగ్‌తో మొదలుకొని రాశి ఖన్నా, సమంత తదితరులు తమ బరువును తగ్గించుకొని బక్క పలచగా తయారయ్యారు. దీంతో వారిలో గ్లో చాలా తగ్గిందని, అస్తిపంజరంలా తయారవుతున్నారని అభిమానులు ఉఫ్ మంటున్నారు. అయినా వారినేం పట్టించుకోకుండా మన టాప్ హీరోయిన్లు కష్టపడి మరీ కండలు కరిగించేస్తున్నారు.

కాగా ప్రస్తుతం కీర్తి సురేశ్ పలు ప్రాజెక్ట్‌లలో నటిస్తోంది. అందులో కొత్త దర్శకుడు నరేంద్ర నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సఖి ఒకటి కాగా.. జాతీయ అవార్డు గ్రహీత నగేష్ కుకునూరు దర్శకత్వంలో మరొకటి, బాలీవుడ్‌లో అజయ్ దేవగన్ సరసన ఇంకొకటి. సఖి మూవీ షూటింగ్ ప్రస్తుతం యూరప్‌లో జరుగుతుండగా.. నగేష్ కుకునూర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు మరింత సమయం పట్టనుంది. వీటితో పాటు నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘మన్మథుడు 2’లోనూ ఆమె కెమెరా అప్పియరెన్స్ ఇవ్వనుంది.