అందుకే ఈ అవార్డు మా అమ్మకు అంకితం: కీర్తి సురేష్

శుక్రవారం ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో మహానటి చిత్రానికి గానూ జాతీయ ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైంది కీర్తి సురేష్. ఈ సందర్భంగా ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ అవార్డు తనకు రావడంపై కీర్తి సురేష్ స్పందించింది. ఉత్తమ నటి పురస్కారం దక్కడం సంతోషంగా ఉందని..ఈ అవార్డును తన అమ్మకు అంకితమిస్తున్నట్లు మహానటి ప్రకటించింది. మేనక తొలి మలయాళం సినిమాకు జాతీయ అవార్డు రావాల్సి ఉందని.. కానీ కొద్దిలో జారిపోయిందని చెప్పిన ఆమె.. అందుకే […]

అందుకే ఈ అవార్డు మా అమ్మకు అంకితం: కీర్తి సురేష్
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2019 | 11:27 AM

శుక్రవారం ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో మహానటి చిత్రానికి గానూ జాతీయ ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైంది కీర్తి సురేష్. ఈ సందర్భంగా ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ అవార్డు తనకు రావడంపై కీర్తి సురేష్ స్పందించింది. ఉత్తమ నటి పురస్కారం దక్కడం సంతోషంగా ఉందని..ఈ అవార్డును తన అమ్మకు అంకితమిస్తున్నట్లు మహానటి ప్రకటించింది. మేనక తొలి మలయాళం సినిమాకు జాతీయ అవార్డు రావాల్సి ఉందని.. కానీ కొద్దిలో జారిపోయిందని చెప్పిన ఆమె.. అందుకే ఈ అవార్డును ఆమెకు అంకితమిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇక తనకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన మహానటి చిత్రబృందం మొత్తానికి కృతఙ్ఞతలు తెలిపారు. తన జీవితంలో ఇదో గొప్ప అనుభూతి అని చెప్పారు. కాగా అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటిని తెరకెక్కించారు. ఇందులో సావిత్ర పాత్రలో నటించిన కీర్తి సురేష్.. అందులో పరకాయ ప్రవేశం చేశారు. కొన్ని సన్నివేశాల్లో సావిత్రినే నటించిందా..! అన్నంతగా నటించి అందరినీ మెప్పించారు. ఇక జాతీయ అవార్డుల్లో మూడు విభాగాల్లో అవార్డులు దక్కించుకున్న మహానటి.. గతేడాది మెల్‌బోర్న్ ఫిలిం ఫెస్టివల్‌లోనూ ఈక్విటీ ఇన్ సినిమా అవార్డు కేటగిరీలో ఒక అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!