మహానటి బాలీవుడ్ ఎంట్రీ ఖరారు..!

|

Mar 13, 2019 | 11:19 AM

‘మహానటి’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్న ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. గతంలో బోనీ కపూర్ నిర్మాతగా కీర్తి సురేష్ ఒక సినిమా చేస్తుందని రూమర్స్ వినిపించాయి. ఇక ఆ రూమర్స్ నిజం చేస్తూ ఈరోజు ట్విట్టర్ ద్వారా చిత్ర యూనిట్ వెల్లడించింది. తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ అమిత్ శర్మ రూపొందించే బయోపిక్ లో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపికైందట. ఇక […]

మహానటి బాలీవుడ్ ఎంట్రీ ఖరారు..!
Follow us on

‘మహానటి’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్న ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. గతంలో బోనీ కపూర్ నిర్మాతగా కీర్తి సురేష్ ఒక సినిమా చేస్తుందని రూమర్స్ వినిపించాయి. ఇక ఆ రూమర్స్ నిజం చేస్తూ ఈరోజు ట్విట్టర్ ద్వారా చిత్ర యూనిట్ వెల్లడించింది.

తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ అమిత్ శర్మ రూపొందించే బయోపిక్ లో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపికైందట. ఇక ఈ సినిమాలో హీరోగా అజయ్ దేవగన్ నటించనున్నారు. ఇండియన్ ఫుట్ బాల్ కోచ్ సైద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందట. బోని కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.