మీరు అలా ఫీల్ అవ్వకపోతే నాపేరు మార్చుకుంటా : నటకిరీటి

| Edited By: Pardhasaradhi Peri

Jul 03, 2019 | 2:15 PM

నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ‘కౌసల్య కృష్ణమూర్తి’. ఈ సినిమాకి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా, కేఎస్ రామారావు సమర్పణలో కేఏ వల్లభ ఈ నిర్మించారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తమిళంలోని ‘కనా’ సినిమాను.. తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’గా రీమేక్ చేశారు. తమిళ ‘కనా’లో నటించిన ఐశ్వర్య రాజేశ్‌నే తెలుగులో కూడా నటించింది. ఈ సందర్భంగా […]

మీరు అలా ఫీల్ అవ్వకపోతే నాపేరు మార్చుకుంటా : నటకిరీటి
Follow us on

నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ‘కౌసల్య కృష్ణమూర్తి’. ఈ సినిమాకి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా, కేఎస్ రామారావు సమర్పణలో కేఏ వల్లభ ఈ నిర్మించారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

తమిళంలోని ‘కనా’ సినిమాను.. తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’గా రీమేక్ చేశారు. తమిళ ‘కనా’లో నటించిన ఐశ్వర్య రాజేశ్‌నే తెలుగులో కూడా నటించింది. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాక.. ‘ప్రతీ ఆడపిల్లకు రాజేంద్రప్రసాద్‌ లాంటి తండ్రి ఉంటే ఎంత బావుంటుందో అని ఫీల్ అవుతారని.. లేకపోతే నా పేరే మార్చుకుంటా’ అని తెలిపారు. కౌసల్య కృష్ణమూర్తి గొప్ప కథ అని.. ఇందులో కామెడీ, తండ్రీ కూతుళ్ల బంధం చాలా చక్కగా ఉందని చెప్పారు.