Katrina Kaif: విక్కీ- కత్రినాల పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!.. తేదీ ఎప్పుడంటే..

ప్రస్తుతం బాలీవుడ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న హాట్‌ టాపిక్‌ ఏమిటంటే.. కత్రినా కైఫ్- విక్కీ కౌశల్‌ల వివాహమే. గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్న వీరు త్వరలోనే పెళ్లిపీటలెక్కుతున్నారని బాలీవుడ్‌ కోడై కూస్తోంది

Katrina Kaif: విక్కీ- కత్రినాల పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!.. తేదీ ఎప్పుడంటే..

Updated on: Nov 26, 2021 | 8:30 PM

ప్రస్తుతం బాలీవుడ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న హాట్‌ టాపిక్‌ ఏమిటంటే.. కత్రినా కైఫ్- విక్కీ కౌశల్‌ల వివాహమే. గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్న వీరు త్వరలోనే పెళ్లిపీటలెక్కుతున్నారని బాలీవుడ్‌ కోడై కూస్తోంది. డిసెంబర్‌ మొదటివారంలో రాజస్థాన్‌లోని ఓ విలాసవంతమైన ప్యాలెస్‌లో వీరి వివాహ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. కాగా కత్రినా సన్నిహితుడు, ప్రముఖ దర్శకుడు కబీర్‌ఖాన్‌ ఇంట్లో ఇటీవలే కత్రినా- విక్కీల నిశ్చితార్థం జరగడం, వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ కావడం తెలిసిందే. అయితే తమ రిలేషన్‌షిప్‌ విషయంలో మొదటి నుంచి గోప్యత పాటిస్తున్న ఈ ప్రేమ పక్షులు.. తమ పెళ్లి విషయంలోనూ అదే ప్రైవసీ పాటించాలని భావిస్తోంది. కాగా తాజాగా వీరిద్దరి పెళ్లి ముహూర్తం ఫిక్స్‌ అయిందని తెలుస్తోంది.

రాజస్థాన్ లోని విలాసవంతమైన సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్ బర్వరాలో డిసెంబరు 9న ఈ ప్రేమ పక్షులు పెళ్లి పీటలెక్కనున్నారని కత్రినా బంధువులతో పాటు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆ రోజు సాయంత్రం హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరుగుతుందని వారు తెలిపారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన దగ్గరి బంధవులు, సన్నిహితులు మాత్రమే వస్తున్నారని కత్రినా సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇక ప్రి వెడ్డింగ్‌ కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్‌ 7న మెహందీ, 8న సంగీత్‌ వేడుకలు జరగనున్నాయట. ఈ నేపథ్యంలో పెళ్లికి తక్కువ రోజులు మిగిలి ఉండడంతో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక తన మెహందీ ఫంక్షన్ కోసం కత్రినా కైఫ్ భారీగానే ఖర్చు చేస్తోందట. ఇందుకోసం దాదాపుగా రూ. 1లక్ష వరకు ఖర్చుచేసి రాజస్థాన్‌ హెన్నానీ ఆర్డర్‌ చేసిందట.

Also Read:

Digital News Round Up: అఖండ వేదికపై సరైనోడు | 5 లక్షల కోట్ల సంపద ఆవిరి.. లైవ్ వీడియో

Olivia Morris: కుర్రోళ్ళ కొత్త క్రష్.. ఒలివియా మోరిస్ లేటెస్ట్ ఫొటోస్

Kalyani Priyadarshan: వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్న అందాల చందమామ.. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్ లేటెస్ట్ పిక్స్