‘ఛలో’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ తన రెండో చిత్రం ‘గీత గోవిందం’ తో స్టార్ హీరోయిన్ గా స్టేటస్ సంపాదించింది. ప్రస్తుతం వరస పెట్టి సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తమిళ హీరో కార్తీ సరసన ఒక చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే.
కాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఈరోజు ప్రారంభమైంది. రెమో ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెర్విన్.జె.సాల్మోన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు చిత్ర యూనిట్.