Tollywood : సినిమా వచ్చినప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. సీక్వెల్ వచ్చేసరికి హీరోయిన్ అయ్యింది.. ఇప్పుడు చూస్తే..

సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. తమ అమాయకమైన నటనతోపాటు అందమైన రూపంతో ఆకట్టుకున్న చిన్నారులు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోహీరోయిన్లతో కలిసి అలరించిన బాలనటులు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా మారుతున్నారు. కొందరు స్టార్స్ గా సక్సెస్ కాగా.. మరికొందరు ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో గత్తరలేపుతున్నారు.

Tollywood : సినిమా వచ్చినప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. సీక్వెల్ వచ్చేసరికి హీరోయిన్ అయ్యింది.. ఇప్పుడు చూస్తే..
Monika Shiva

Updated on: Sep 11, 2026 | 7:43 AM

కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, స్టార్ హీరో కార్తీ కథానాయకుడిగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఖైదీ’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ప్రధానాకర్షణగా నిలిచింది. అందులో కార్తీ (ఢిల్లీ) కూతురు ‘అముద’ పాత్రలో నటించిన చిన్నారి మోనిక శివ (Monica Siva) తన అమాయకత్వంతో, సహజసిద్ధమైన నటనతో అందరి హృదయాలను గెలుచుకుంది. ఖైదీ సినిమా విడుదలైన సమయంలో మోనిక ఐదో తరగతి చదువుతున్న చిన్న పాప. ఈ మూవీలో తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. అయితే ఈ సినిమా సమయంలో అమాయకంగా కనిపించిన ఈ అమ్మాయి.. ఇప్పుడు బాగా పెరిగి పెద్దదైంది. ఇటీవల సోషల్ మీడియాలో మోనిక షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

అప్పటి అమాయకపు లుక్ నుండి ట్రెండీ అండ్ గ్లామరస్ మేకోవర్‌లోకి మారిపోయిన మోనికను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. “ఈ అమ్మాయి ఖైదీలో కార్తీ కూతురా? అసలు గుర్తుపట్టలేకపోతున్నాం” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మోనిక కేవలం ‘ఖైదీ’లోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో అనేక ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించింది. నయనతార నటించిన ‘రాక్షసన్’, విజయ్ ‘బైరవా’, అజిత్ ‘వేదాళం’ వంటి సినిమాల్లో బాలనటిగా మెప్పించింది. మలయాళంలో మమ్ముట్టితో కలిసి చేసిన ‘ది ప్రీస్ట్’ (The Priest) చిత్రానికి గానూ ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్‌గా అవార్డును కూడా సొంతం చేసుకుంది.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

ప్రస్తుతం ప్లస్ 2 చదువుతున్న మోనిక, గ్లామరస్ లుక్స్‌లో మెరుస్తుండటంతో హీరోయిన్‌గా మారేందుకు సిద్ధమవుతోందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మోనిక సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. మోనిక గ్లామర్ అండ్ క్యూట్ పిక్స్ చూసిన నెటిజన్లు త్వరలోనే ఈ భామ సౌత్ ఇండస్ట్రీలో మంచి కథానాయికగా పేరు తెచ్చుకోవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

మోనికా శివ..

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

Loading...
Unable to load recommendations.
Follow Us