AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 260 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. IMDBలో టాప్ రేటింగ్

ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓవరాల్ గా రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి హీరో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమా శుక్రవారం (ఆగస్టు 11) నుంచి ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 260 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. IMDBలో టాప్ రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Sep 11, 2026 | 6:55 AM

Share

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో మలయాళం అందాల తార మమితా బైజు హీరోయిన్ గా చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదలైన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓవరాల్ గా రూ. 260 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సూర్య కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సూర్య సెటిల్డ్ యాక్టింగ్, మమితా బైజు క్యూట్ అల్లరి, రాధిక, రవీనా టాండన్ ల అభినయం, డైరెక్టర్ వెంకీ అట్లూరి టేకింగ్, అలాగే జీవీ ప్రకాశ్ కుమార్ పాటలు.. వెరసి విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాను బ్లాక్ బస్టర్ రేంజ్ కు తీసుకెళ్లాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. తమిళం కంటే తెలుగులోనే సూర్య సినిమాకు అత్యధిక కలెక్షన్లు రావడం విశేషం. థియేటర్లలో బ్లాక్ బస్టర్ రేంజ్ సాధించిన ఈ సినిమాను ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణకు తెరపడింది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (ఆగస్టు 11) అర్ధరాత్రి నుంచే సూర్య సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తమిళం, తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ విశ్వనాథ్ అండ్ సూర్య సినిమా అందుబాటులో ఉంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించారు. సీనియర్ హీరోయిన్లు రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ లతో పాటు నాజర్, సునీల్ రెడ్డి, రాజీవ్ మేనన్, హర్ష చెముడు, కాళి వెంకట్, దీపా శంకర్, హైపర్ ఆది, మైమ్ గోపి, సర్వదమన్ బెనర్జీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మరి థియేటర్లలో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే ఎందుకు లేటు.. ఎంచెక్కా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

విశ్వనాథ్ అండ్ సన్స్ పై ఓ నెటిజన్ రివ్యూ..

h3>విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us