Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rock Star Yash: మరో భారీ ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యశ్.. నార్తాన్ డైరెక్షన్‏లో రాక్ స్టార్..

కన్నడ హీరో యష్.. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయాడు. సాధారణ రౌడీ ఓ పెద్ద మాఫీయా డాన్‏ను ఎదుర్కొవడం.. భారీ లక్ష్యాన్ని..

Rock Star Yash: మరో భారీ ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యశ్.. నార్తాన్ డైరెక్షన్‏లో రాక్ స్టార్..
Yash
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 17, 2021 | 8:26 PM

కన్నడ హీరో యష్.. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయాడు. సాధారణ రౌడీ ఓ పెద్ద మాఫీయా డాన్‏ను ఎదుర్కొవడం.. భారీ లక్ష్యాన్ని.. ఎలా చేరుకోవాలో చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరోసారి యశ్ తో కలిసి.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 2 ను తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. యశ్ తదుపరి చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా రాక్ స్టార్ నెక్ట్స్ మూవీకి సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముఫ్తీ ఫేం నార్తాన్ డైరెక్షన్ లో యశ్ సినిమా చేయబోతున్నట్లుగా టాక్. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాకు యశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. అంతేకాదు.. ఇందులో యశ్ నెవీ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లుగా టాక్. ఈ సినిమాను జీ స్టూడియోస్‌, హోంబాలే ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో యశ్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించబోతుందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నట్లుగా సమాచారం. అయితే ఇంతవరకు ఈ సినిమాకు టైటిల్ ఖారారు కాలేదు. ప్రశాంత్ నీల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉగ్రమ్, రథవారా చిత్రాలకు పనిచేశారు. ఆ తర్వాత 2017లో ముఫ్తీ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ సూపర్ హిట్ సాధించింది.

Also Read: CJI NV Ramana: హైదరాబాద్ లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న సీజేఐ ఎన్వీ రమణ

పిల్లలపై జులై నుంచి నోవావ్యాక్స్ క్లినికల్ ట్రయల్స్ ..? సీరం సంస్థ యోచన… దరఖాస్తు సమర్పిస్తామన్న ఆదార్ పూనావాలా

CM Jagan : నూతన విద్యా విధానం వల్ల ఇప్పటివారికే కాదు, తర్వాత తరాలకు కూడా విశేష ప్రయోజనం : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి

Telangana Cabinet Sub-Committee: రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీల కీల‌క‌ భేటీ.. రెవెన్యూ మోబిలైజేషన్, ప్రభుత్వ వైద్య సేవలపై ప్రధాన చర్చ!