Coronavirus: సినీ తారలను వదలని కరోనా.. బాలీవుడ్ అందాల తార కాజోల్ కు పాజిటివ్..

|

Jan 30, 2022 | 1:34 PM

సినిమా ప్రముఖులను కరోనా (Coronavirus) వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ఐసోలేషన్ (Isolation) లో చికిత్స తీసుకుంటున్నారు.  తాజాగా బాలీవుడ్ అందాల తార కాజోల్ (Kajol) కరోనా వైరస్ బాధితుల జాబితాలో చేరిపోయింది

Coronavirus: సినీ తారలను వదలని కరోనా.. బాలీవుడ్ అందాల తార కాజోల్ కు పాజిటివ్..
Kajol
Follow us on

సినిమా ప్రముఖులను కరోనా (Coronavirus) వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ఐసోలేషన్ (Isolation) లో చికిత్స తీసుకుంటున్నారు.  తాజాగా బాలీవుడ్ అందాల తార కాజోల్ (Kajol) కరోనా వైరస్ బాధితుల జాబితాలో చేరిపోయింది.  తనకు కొవిడ్ సోకిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమే  వెల్లడించింది. అయితే ఈ పోస్ట్ లో తన ఫొటోకు బదులుగా తన గారాల పట్టి నైసా ఫొటోను పోస్ట్ చేయడం గమనార్హం. ఇందులో నైసా ఏదో పెళ్లి వేడుకలో తన చేతికి ఉన్న మెహెందీని, వేళ్లకు ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ చిరునవ్వులు చిందిస్తోంది.  కాగా పోస్ట్ లో తన ఫొటో కు బదులుగా నైసా ఫొటోను ఎంచుకోవడానికి గల కారణాన్ని కూడా ఇందులో పంచుకుంది.

అందుకే నా కూతురు ఫొటోను షేర్ చేస్తున్నా!

‘ నాకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ  అయ్యింది. నా రుడాల్ఫ్ ముక్కు (జలుబు కారణంగా ముక్కు ఎర్రబారడం) ను ఎవరూ చూడాలని నేను కోరుకోవడం లేదు.  అందుకే ప్రపంచంలోనే  అత్యంత మధురమైన నా కూతురి నవ్వును మీతో పంచుకుంటున్నాను. మిస్ యూ నైసా’ అంటూ రాసుకొచ్చింది కాజోల్. ఈ పోస్టుకు కాజోల్ సోదరి నటి తనిషా ముఖర్జీ స్పందించింది. ‘వర్చువల్ హగ్స్ ‘ అందుకో అంటూ లవ్, స్మైలీ ఎమోజీలను షేర్ చేసింది. ఇటీవల అమ్మగా ప్రమోషన్ పొందిన ప్రియాంకా చోప్రా కూడా  ‘స్టన్నింగ్ బ్యూటీ’ అంటూ కామెంట్ పెట్టింది.  కాగా కరోనా బారిన పడిన కాజోల్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు, నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. ఈ మేరకు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  ఇక సినిమాల విషయానికొస్తే .. గతేడాది ‘త్రిభంగా’ అనే సినిమాలో నటించింది కాజోల్. ప్రస్తుతం ఆమె ‘ ద లాస్ట్ హుర్రా’ అనే చిత్రంలో నటిస్తోంది.

Also Read:Allu Arjun: గంధపు దుంగలు, కేకులు.. దుబాయ్ వెకేషన్ నుంచి తిరిగొచ్చిన బన్నీకి అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు..

Puneeth Rajkumar: ఆ సమయంలో తమ్ముడిని అలా చూడడం మనసుకు కష్టంగా అనిపించింది.. మరోసారి భావోద్వేగానికి గురైన శివరాజ్ కుమార్..

Tirupati: తిరుపతిలో దారుణం.. జనసేన కార్యకర్తను కత్తులతో నరికి చంపిన దుండగులు..