‘Live Telecast’ Trailer: మీరెప్పుడైనా లైవ్‌లో దెయ్యాన్ని చూశారా! లేదంటే మేము చూపిస్తామంటున్న ‘లైవ్‌ టెలికాస్ట్‌’ టీం..

'Live Telecast' Trailer: పెళ్లైన తర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకువెళుతోంది టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. అగ్ర హీరోల సరసన నటిస్తూనే

Live Telecast Trailer: మీరెప్పుడైనా లైవ్‌లో దెయ్యాన్ని చూశారా! లేదంటే మేము చూపిస్తామంటున్న ‘లైవ్‌ టెలికాస్ట్‌’ టీం..

Edited By:

Updated on: Jan 30, 2021 | 6:49 AM

‘Live Telecast’ Trailer: పెళ్లైన తర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకువెళుతోంది టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. అగ్ర హీరోల సరసన నటిస్తూనే మరోవైపు వెబ్‌ సరీస్‌లు చేస్తుంది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన మొదటి వెబ్ సిరీస్ ‘లైవ్‌ టెలికాస్ట్‌’ ట్రైలర్ రిలీజ్ అయింది. ‘లైవ్‌ దెయ్యాన్ని షూట్‌ చేసి టెలికాస్ట్‌ చెయ్యబోతున్నాం’ అంటూ ప్రేక్షకులకు థ్రిల్ పంచడానికి ముందుకొస్తుంది. తమిళంలో రూపొందుతున్న ఈ సిరీస్‌కు వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.

ఫిబ్రవరి 12న ఈ వెబ్‌ సిరీస్‌ డిస్నీ హాట్‌స్టార్‌లో అన్ని భాషల్లో ప్రసారం కానుంది. ‘దెయ్యాన్ని లైవ్‌ టెలికాస్ట్‌ చేద్దామని ఓ ఇంటికి వెళ్లిన టీవీ బృందానికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? నిజంగా వాళ్లకు దెయ్యం కనపడిందా? ఆ తర్వాత వాళ్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఎలా బయటపడ్డారు? అనేదే ఈ వెబ్ సరీస్ నేపథ్యం. హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో వైభవ్‌, ఆనంది కీలక పాత్రలు పోషిస్తున్నారు. దెయ్యం కళ్లతో కాజల్ అగర్వాల్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి ప్రేక్షకులను ఎంతమేరకు భయపెడుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.