ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో తన తీరుతో హడావిడి చేసిన కేఏ పాల్.. ఫలితాల తరువాత మాత్రం అఙ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో సైతం కనిపించని పాల్.. ఇప్పుడు మళ్లీ దర్శనమిచ్చారు. ఆయనకు సంబంధించిన ఓ వీడియోను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ముందుగా తాను రెగ్యులర్‌గా షోలో కనిపించడం లేదని క్షమాపణలు కోరిన పాల్.. ‘‘మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ యుద్ధాన్ని ఆపేందుకు ఏడు ప్రపంచ దేశాలకు చెందిన నేతలను కలిసాను. త్వరలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు లేఖ రాయబోతున్నా’’ అంటూ వివరించాడు. ఇక ఈ వీడియోకు వర్మ దండాలు ఉన్న ఎమోజీలని పెట్టగా.. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు గతంలోనూ పాల్ చాలానే చేసిన విషయం తెలిసిందే. అప్పుడు ఆయన వ్యాఖ్యలు నిజాలే అయినప్పటికీ.. కాలక్రమేణా కామెడీగా అయిపోయాయి.
ఇదిలా ఉంటే వర్మ తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లులో చిత్రంలో కేఏ పాల్ పాత్రను కూడా పెట్టారు. అంతేకాదు అందులో కేఏ పాల్‌కు సంబంధించిన పోస్టర్లతో పాటు.. ఓ పాటను కూడా విడుదల చేశాడు. వీటికి సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన హడావిడినంతా ఈ సినిమాలో చూపించబోతున్నారు వర్మ.
K A PAUL ??? pic.twitter.com/NcDNcJSADG
— Ram Gopal Varma (@RGVzoomin) November 3, 2019