NTR family trip: దాదాపు ఆరు నెలల గ్యాప్ తరువాత సెట్స్‌పైకి వెళ్లిన ఎన్టీఆర్.. మళ్లీ షూటింగ్‌కి చిన్న గ్యాప్ ఇచ్చారు. తన భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు భార్గవ్ రామ్, అభయ్ రామ్‌లతో గత వారం దుబాయ్‌కి వెళ్లారు. ఈ క్రమంలో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారాయి. కాగా ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 22 నుంచి ఎన్టీఆర్ మళ్లీ ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. (రోడ్డు ప్రమాదం.. ప్రముఖ లిరిసిస్ట్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు)
కాగా బాహుబలి బ్లాక్‌బస్టర్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్నారు. ఇక రియల్ కారెక్టర్స్‌తో ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. వారి సరసన అలియా, ఒలివియా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పలు భారతీయ భాషల్లో వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. (పెరిగిన సోనూసూద్ క్రేజ్.. ‘ఆచార్య’ పాత్రలో పలు మార్పులు..!)