Johnny Master teaching : తన డ్యాన్స్‌నే ఆయుధంగా చేసుకొని జానీ మాస్టర్ అంచెలంచెలుగా ఎదిగాడు. టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు విజయవంతమైన చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా చేశాడు. తన డ్యాన్స్ మూమెంట్స్‌తో యువతను ఉర్రూతలూగించాడు. తాజాగా ఓ సినిమా ద్వారా హీరోగా కూడా మారబోతున్నాడు. అయితే తాను హీరోగా మారినా డ్యాన్స్‌ను మాత్రం వదలనని చెబుతున్నాడు. అయితే తాజాగా తమిళ హీరో ధనుష్ 43వ చిత్రంలోని సూపర్ క్రేజీ సాంగ్‌కు డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నాడు. హీరో ధనుష్‌కు స్టెప్పులు నేర్పిస్తూ అదరగొడుతున్నాడు.
అయితే ధనుష్‌తో రిహార్సల్ చేసిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫొటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ధనుష్ నుంచి మరో ట్రెండింగ్ సాంగ్ రెడీ అవుతోందని చెప్తూ ట్వీట్ చేశాడు జానీ. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో మాళవికా మోహనన్, స్మృతి వెంకట్ హీరోయిన్లు కాగా.. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. మరి ఈ సాంగ్ ఎంత పాపులర్ అవుతుందో తెలియాలంటే సినిమా కోసం వేచి చూడక తప్పదు.
Rehearsing for a Super crazy song from #D43 with @dhanushkraja Sir ?
Another Trending song from #Dhanush sir is on the way ?@karthicknaren_M @TGThyagarajan @SathyaJyothi_ @MalavikaM_ @gvprakash @Lyricist_Vivek pic.twitter.com/Z0GKH3A1Ny
— Jani Master (@AlwaysJani) January 7, 2021
మొదలైన జానీ మాస్టర్ సినిమా.. తొలిషాట్ కు క్లాప్ కొట్టిన యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్
Jani Master turns actor : స్టెప్పులతో ఇరగ్గొట్టిన జానీ మాస్టర్..యాక్టింగ్‌తో అదరగొడతాడా..?