‘ఇస్మార్ట్ శంకర్’ వచ్చేస్తున్నాడు..!

|

May 26, 2019 | 3:05 PM

ఎనర్జిటిక్ హీరో రామ్ దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ  సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం జూలై 12న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. మరోవైపు ఈ చిత్ర […]

ఇస్మార్ట్ శంకర్ వచ్చేస్తున్నాడు..!
Follow us on

ఎనర్జిటిక్ హీరో రామ్ దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ  సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం జూలై 12న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.

నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. మరోవైపు ఈ చిత్ర విజయం అటు పూరికి , ఇటు రామ్ కెరీర్‌కి కీలకం కానుంది. పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు