ఆ రీమేక్‌పై ఆసక్తిగా ఉన్న మాటల మాంత్రికుడు!

ఈ ఏడాది విడుదలై పెద్ద విజంయ సాధించిన మలయాళ చిత్రాల్లో అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ ఒకటి. పృథ్వీరాజ్‌, బిజు మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన

ఆ రీమేక్‌పై ఆసక్తిగా ఉన్న మాటల మాంత్రికుడు!

Updated on: Sep 01, 2020 | 12:51 PM

Trivikram Srinivas News: ఈ ఏడాది విడుదలై పెద్ద విజంయ సాధించిన మలయాళ చిత్రాల్లో అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ ఒకటి. పృథ్వీరాజ్‌, బిజు మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్కడ మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్‌లో రీమేక్ చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఈ మూవీ తెలుగు రీమేక్ హక్కులను ఎప్పుడో సొంతం చేసుకున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌.. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇందులో ప్రధాన పాత్రల కోసం పలువురిని ఇప్పటికే నిర్మాతలు సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ సినిమాను చూసిన పవన్‌.. ఇందులో నటించేందుకు ఆసక్తిగా చూపారట.

కాగా మరోవైపు ఈ మూవీ కోసం మొదట దర్శకుడిగా సాగర్ చంద్రను నిర్మాతలు అనుకున్నారట. ఇక సాగర్ చంద్ర తెలుగుకు తగ్గట్టుగా స్క్రిప్ట్‌ను కూడా తయారు చేశారట. అయితే ఈలోపే ఈ రీమేక్‌పై పవన్‌ ఆసక్తిని చూపడంతో.. నిర్మాతలు మరో దర్శకుడి కోసం వెతుకుతున్నారట. ఈ క్రమంలో ఈ రీమేక్‌కి సరిపోయే దర్శకుడు కావాలని పవన్‌, త్రివిక్రమ్‌ని అడిగినట్లు తెలుస్తోంది. పవన్ అడగడంతో ఈ రీమేక్‌కు తానే దర్శకత్వం వహించాలన్న ఆలోచనలో త్రివిక్రమ్‌ పడ్డారని సమాచారం. అంతేకాదు దీనిపై పవన్‌తో సంప్రదింపులు జరపడం కూడా అయ్యాయని టాక్‌. అన్నీ కుదిరితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే పవన్ ప్రస్తుతం మూడు చిత్రాలకు ఓకే చెప్పారు. ఇందులో పింక్ రీమేక్‌ వకీల్ షాబ్‌ షూటింగ్‌ క్లైమాక్స్‌లో ఉంది. క్రిష్ దర్శకత్వంలో నటించాల్సిన విరూపాక్షి షూటింగ్‌ కూడా ప్రారంభం కాగా.. అక్టోబర్‌ నుంచి ఈమూవీ చిత్రీకరణలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇక వచ్చే ఏడాది ప్రారంభంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించబోతున్నారు. వీటితో పాటు సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ ఓ మూవీకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

Read More:

త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న నటి విద్యుల్లేఖ

కిమ్ సోదరి ఎక్కడ.. నెలరోజులుగా కనిపించని జాంగ్!

Loading...
Unable to load recommendations.
Follow Us