Bigg Boss 4 Tamil: దక్షిణాదిన బిగ్‌బాస్ కార్యక్రమం హవా కొనసాగుతోంది. ఇప్పుడు తెలుగు, తమిళ్ రెండు భాషల్లో ఈ షో నాలుగో సీజన్ జరుగుతోంది. రెండు భాషల్లోనూ ఈ షో విజయవంతంగా కొనసాగుతుంది. ఐపీఎల్ జరుగుతున్నప్పటికీ ఈ షోకు ఆదరణ తగ్గడం లేదు. ఇక తమిళ్‌లోనూ ఈ సీజన్‌లో 16 మంది పాల్గొన్నారు. ఇందులో వీజే అర్చన చందోక్ వైల్డ్‌కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు.
ఇక తాజా సమాచారం ప్రకారం.. ఇందులో వివాదాస్పద సింగర్, ఆర్జే సుచిత్ర వైల్డ్‌కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఆర్జే ద్వారా కెరీర్‌ని ప్రారంభించిన సుచిత్ర.. ఆ తరువాత తెలుగు, తమిళ్, మలయాళంలో పలు పాటలను పాడారు. అయితే మూడేళ్ల క్రితం సుచీ లీక్స్ పేరుతో పలువురు నటీనటులకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేశారు. దీంతో సుచిత్ర వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో సుచిత్ర భర్త, కమెడియన్ కార్తీక్ ఆమె నుంచి విడాకుల తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ప్రైవేట్ ఆల్బమ్‌లు చేస్తోంది.
Read More:
ఇప్పటికైనా ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటా: సింధు హెచ్చరిక
ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌కి కరోనా పాజిటివ్