Salaar vs Dunki: ప్రభాస్‌, షారుఖ్‌ను ఫాలో అవుతున్నాడా.? ఆ సెంటిమెంట్‌ కలిసొచ్చేనా.?

డంకీ చిత్రం డిసెంబర్‌ డిసెంబర్‌ 21వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధమవుతుండగా, సలార్‌ చిత్రం ఒక రోజు తర్వాత అంటే డిసెంబర్‌ 22న విడుదల చేయనున్నారు. ఇలాంటి రెండు భారీ చిత్రాలు ఒక రోజు గ్యాప్‌లో వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఈ బడా స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే రెండు పాన్‌ ఇండియా చిత్రాల మధ్య పోటీ, ఇప్పుడు థియేటర్ల...

Salaar vs Dunki: ప్రభాస్‌, షారుఖ్‌ను ఫాలో అవుతున్నాడా.? ఆ సెంటిమెంట్‌ కలిసొచ్చేనా.?
Salaar Vs Dunki

Updated on: Dec 19, 2023 | 1:00 PM

ప్రస్తుతం ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ మొత్తం రెండు సినిమాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఈ రెండు చిత్రాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని చూస్తున్నారు. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సలార్‌ చిత్రం ఒకటి కాగా, షారుఖ్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన ‘డంకీ’ మరొకటి. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ. 1000 కోట్లు కలెక్షన్లు రాబట్టే సత్తా ఉన్న చిత్రాలుగా సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

డంకీ చిత్రం డిసెంబర్‌ డిసెంబర్‌ 21వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధమవుతుండగా, సలార్‌ చిత్రం ఒక రోజు తర్వాత అంటే డిసెంబర్‌ 22న విడుదల చేయనున్నారు. ఇలాంటి రెండు భారీ చిత్రాలు ఒక రోజు గ్యాప్‌లో వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఈ బడా స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే రెండు పాన్‌ ఇండియా చిత్రాల మధ్య పోటీ, థియేటర్ల కేటాయింపు విషయం చర్చకు దారి తీసింది. ఉద్దేశపూర్వకంగానే రెండింటిలో ఒక సినిమాకు తక్కువ థియేటర్లు కేటాయిస్తున్నారంటూ సినిమా సర్కిల్స్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇదంతా ఇలా ఉంటే.. సలార్‌ చిత్రానికి సంబంధించి ప్రభాస్‌ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. గతంలో షారుఖ్‌ ఫాలో అయిన సెంటిమెంట్‌ను ఇప్పుడు ప్రభాస్‌ అనుసరిస్తున్నారా అన్న చర్చ తెరపైకి వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. బాలీవుడ్‌లో అగ్ర కథానాయకుడిగా వెలుగు వెలిగిన షారుక్‌ ఖాన్‌.. పఠాన్‌ మూవీ కంటే ముందు భారీ పరాజయాలను ఎదుర్కొన్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్‌ మూవీస్‌ ఇచ్చిన షారుఖ్‌, ఆ తర్వాత వరుస ఓటమిలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయితే 2022లో వచ్చిన పఠాన్‌ ఒక్కసారి షారుఖ్‌ కెరీర్‌ను పరుగులుపెట్టించింది.

పఠాన్‌ విజయం తర్వాత జవాన్‌ చిత్రంతో మరో విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఇదిలా ఉంటే పఠాన్‌ సినిమా విడుదల సమయంలో షారుఖ్‌ పెద్దగా ప్రమోషన్స్‌లో పాల్గొనలేరు. పాన్‌ ఇండియా చిత్రంగా విడుదలైన ఈ సినిమా ప్రమోషన్స్‌ విషయంలో మాత్రం షారుఖ్‌ అంత యాక్టివ్‌గా కనిపించలేరు. చిత్ర యూనిట్ ఏదో నామ మాత్రంగా ప్రమోషన్స్‌ నిర్వహించిన సినిమాను విడుదల చేసింది. అయితే పఠాన్‌ ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు సలార్‌ మూవీ ప్రమోషన్స్‌ను కూడా గమనిస్తే, షారుఖ్‌ సెంటిమెంట్‌ను ప్రభాస్‌ ఫాలో అవుతున్నాడన్న అన్న డౌట్ వస్తోంది.

బాహుబలితో పాన్‌ వరల్డ్‌ హీరోగా అవతరించిన ప్రభాస్‌ ఆ తర్వాత సరైన విజయాన్ని అందుకోలేకపోయారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌ చిత్రాలు ఆశించిన స్థాయిలో మాత్రం విజయాలను అందుకోలేక పోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్న ప్రభాస్‌.. పఠాన్‌ సినిమా రిలీజ్‌ సమయంలో షారుఖ్‌ ఫాలో అయిన సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నట్లు స్పష్టమవుతోంది. అందుకే సలార్‌ మూవీకి చిత్ర యూనిట్ పెద్దగా ప్రమోషన్స్‌ నిర్వహించినట్లు కనిపించడం లేదు.

అసలు ప్రభాస్‌ ఇంత వరకు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. దీంతో ప్రమోషన్స్ నిర్వహించకపోవడం వెనకాల ఏదో కారణం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది.? నిజంగానే పఠాన్‌ సెంటిమెంట్‌ను సలార్‌ ఫాలో అవుతున్నాడా.? మరి ఈ సెంటిమెంట్ వర్కవుట్‌ అవుతుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..