దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఇకపోతే ఈ సినిమాని సెన్సార్ చేయమని.. ఎన్నికల తర్వాత చిత్రం విడుదల చేసుకోవాలని సెన్సార్ బోర్డ్ ఆర్జీవీ ని కోరింది.
దీనితో ఆర్జీవీ సెన్సార్ బోర్డ్ మీద కేసు ఫైల్ చేస్తానని కూడా ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. అయితే తాజా సమాచారం ప్రకారం సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి బుధవారం సర్టిఫికెట్ ఇస్తున్నట్లు వినికిడి. దానితో మార్చి 22న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఒక వారం తర్వాత అంటే మార్చి 29 న రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. దీప్తి బాలగిరి, రాకేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కళ్యాణి మాలిక్ సంగీతాన్ని అందిస్తున్నాడు.