ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ జోరు కొనసాగుతోంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ఆ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచింది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వెళ్లిపోయింది. కేకేఆర్ వరుస విజయాలతో ఆ జట్టు యజమాని, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. బుధవారం (ఏప్రిల్ 03) రాత్రి విశాఖపట్నం వేదికగా జరిగిన ఢిల్లీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ కు షారుక్ ఖాన్ స్వయంగా హాజరయ్యారు. గ్యాలరీలో ఉండి చప్పట్లు కొడుతూ తన టీమ్ ను ఎంకరేజ్ చేస్తూ కనిపించాడు. అయితే కేకేఆర్ విజయం తర్వాత షారుఖ్ ఖాన్ చేసిన ఒక పని అందరి హృదయాలను గెల్చుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత షారుక్ ఖాన్ గ్రౌండ్‌లోకి వచ్చాడు. తన, మన అనే తారతమ్యం లేకుండా కేకేఆర్ ఆటగాళ్లతో పాటు ఢిల్లీ ప్లేయర్లను ఆప్యాయంగా హత్తుకున్నాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, మెంటర్ గౌతమ్ గంభీర్, రింకూ సింగ్, యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీలను మనసారా అభినందించాడు.
ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లను కూడా కలిశాడు షారుఖ్. ముఖ్యంగా మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్ ను మనసారా మెచ్చుకున్నాడు. ఆప్యాయంగా హత్తుకుని చాలా సేపు మాట్లాడాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలువుతన్నాయి. తన, మన అనే తారతమ్యం లేకుండా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను సైతం మనసారా అభినందించిన షారుక్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ఓడిపోయినా పంత్ ఇన్నింగ్స్ హైలెట్ గా నిలిచింది. పంత్ ఆడిన కొన్ని షాట్లకు చప్పట్లు కొట్టి అభినందించాడు షారుఖ్. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.
From SRK with love 🤗 ☺️
Signing off from Vizag 🫡#TATAIPL | #DCvKKR | @DelhiCapitals | @KKRiders | @iamsrk pic.twitter.com/XL7HuIEPyL
— IndianPremierLeague (@IPL) April 3, 2024
No look Pant 🫨#IPLonJioCinema #TATAIPL #DCvKKR pic.twitter.com/OLhLl28aAn
— JioCinema (@JioCinema) April 3, 2024
Thunderous batting display 👏
Comprehensive bowling & fielding display 👏A hat-trick of wins for @kkriders & they go to the 🔝 of the points table 💜
Scorecard ▶️ https://t.co/SUY68b95dG #TATAIPL | #DCvKKR pic.twitter.com/xq4plqLatQ
— IndianPremierLeague (@IPL) April 3, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..