మహాభారతం.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకనిర్మాతల, హీరోల డ్రీమ్ ప్రాజెక్ట్. అయితే మహాభారతంలోని కొన్ని భాగాలతో పలు ఇండస్ట్రీల్లో కొన్ని సినిమాలు వచ్చాయి గానీ మొత్తాన్ని మాత్రం ఇంతవరకు సినిమాగా తెరకెక్కించలేకపోయారు. ఇదిలా ఉంటే ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తే ఇందులో నటించేందుకు టాప్ హీరోలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో మహాభారతంపై తన కోరికను బయటపెట్టాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.
ప్రస్తుతం సాహో ప్రమోషన్లలో బిజీగా ఉన్న ప్రభాస్‌కు.. మహాభారతం చేయాల్సి వస్తే అందులో ఏ పాత్ర చేయడానికి ఇష్టపడతారు అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన ప్రభాస్.. అందులో ఎలాంటి పాత్ర చేయడానికైనా ఇష్టమే. ముఖ్యంగా అర్జునుడి పాత్ర చేస్తాను అంటూ మనసులోని మాటను బయటపెట్టాడు ఈ హీరో. మరి భవిష్యత్‌లో ఏ స్టార్ దర్శకుడైనా మహాభారతం చేస్తే.. అందులో అర్జునుడి పాత్రను ప్రభాస్‌కు ఇస్తారేమో చూడాలి.
ఇదిలా ఉంటే సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం సాహో ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఒకేరోజు విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.