పీపీఈ కిట్ ధరించడం అంత వీజీ కాదు

కరోనా రోగులకు సేవలందించేందుకు వైద్య సిబ్బంది గంటల తరబడి పీపీఈ కిట్‌లు ధరిస్తున్నారు. వీటిని ధరించడం వలన డాక్టర్లు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

పీపీఈ కిట్ ధరించడం అంత వీజీ కాదు

Edited By:

Updated on: Jul 25, 2020 | 4:40 PM

కరోనా రోగులకు సేవలందించేందుకు వైద్య సిబ్బంది గంటల తరబడి పీపీఈ కిట్‌లు ధరిస్తున్నారు. వీటిని ధరించడం వలన డాక్టర్లు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పీపీఈ కిట్‌లతో శ్వాస తీసుకోవడం కాస్త కష్టమైనదే. అయినా ఆ బాధను భరిస్తూ రోగులకు సేవలు చేస్తూ దేవుళ్లుగా నిలుస్తున్నారు. కాగా పీపీటీ కిట్‌ని ధరించడం అంత ఈజీ కాదని చెబుతోంది అందాల భామ లావణ్య త్రిపాఠి.

లాక్‌డౌన్‌ వలన గత నాలుగు నెలలుగా హైదరాబాద్‌లోనే ఉండిపోయిన లావణ్య త్రిపాఠి ఇటీవలే ఉత్తరాఖండ్‌లోని తన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా పీపీఈ కిట్‌ ధరించి ఈ ముద్దుగుమ్మ.. విమానంలో సొంత రాష్ట్రానికి వెళ్లింది. ఈ కిట్‌ని తాను రెండున్నర గంటల పాటు ధరించానని.. ఈ క్రమంలో తనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైందని లావణ్య చెప్పుకొచ్చారు. అయితే పీపీఈ కిట్‌ వలన ఒక ఉపయోగం ఏంటంటే.. మన డ్రస్ ఎలా ఉందన్న బాధ ఉండదని వెల్లడించారు.

ఇక తన రాకపై తన తల్లి సంతోషం వ్యక్తం చేసినప్పటికీ.. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో భౌతిక దూరం పాటించానని లావణ్య తెలిపారు. అంతేకాదు ఈ సమయంలో ఇంట్లో తల్లులు పడే కష్టం తెలిసొచ్చిందని వివరించారు. కాగా ఈ నటి ప్రస్తుతం సందీప్ కిషన్ సరసన ‘ఏ 1 ఎక్స్‌ప్రెస్’‌, కార్తికేయ సరసన ‘చావు కబురు చల్లగా’ అనే చిత్రాల్లో నటిస్తోంది.