మంచు ఫ్యామిలీలో గొడవలు పీక్స్‌కి చేరాయ్. ఒకవైపు మోహన్‌బాబు.. ఇంకోవైపు మంచు మనోజ్.. ఢీ అంటే ఢీ అంటున్నారు. పరస్పర ఫిర్యాదులతో ఫ్యామిలీ ఫైట్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లారు ఇద్దరు. చిన్నకొడుకు నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్‌బాబు అంటుంటే.. తన తండ్రివి అసత్య ఆరోపణలు అంటున్నారు మనోజ్.. ఈ క్రమంలోనే.. మోహన్ బాబు మీడియా పై దాడి చేయడం కలకలం రేపింది.. తన కూతుర్ని చూడనివ్వడం లేదని మనోజ్ మీడియాను మోహన్ బాబు ఇంటికి దగ్గరకు తీసుకెళ్లగా.. మోహన్ బాబు ఆగ్రహంతో మీడియాపై దాడి చేసి.. విచక్షణారహితంగా ప్రవర్తించారు.
టీవీ9, టీవీ5 ప్రతినిధులపై మోహన్ బాబు రెచ్చిపోయారు.. అందరిముందే మోహన్‌బాబు పరుషపదజాలంతో నోటికొచ్చిన విధంగా మీడియా ప్రతినిధులను తిడుతూ.. దాడి చేశారు.. మోహన్‌బాబు దాడిలో టీవీ9 ప్రతినిధికి తీవ్ర గాయాలయ్యాయి.. మోహన్ బాబుతో పాటు.. ఆయన బౌన్సర్లు కూడా రెచ్చిపోయారు.. వారు కూడా మీడియా ప్రతినిధులపై రెచ్చిపోయారు.. మోహన్ బాబు దాడిలో జైగోమాటిక్ ఎముక మూడు చోట్ల విరిగింది. కంటికి, చెవికి మధ్య గాయాలయ్యాయి.
మోహన్ బాబు మీడియాపై దాడి చేయడంతో జర్నలిస్టులు ఆయన ఇంటి దగ్గర ఆందోళనకు దిగారు..