శరవేగంగా అల్లు అర్జున్ మూవీ షూటింగ్.. ప్రీరిలీజ్ ముందే భారీ ధరకు పుష్ప నైజాం హక్కులు..?

అల్లు అర్జున్ పుష్పరాజ్ గా అలరించాడని సిద్దమవుతున్న విషయం తెలిసిందే.. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ పుష్ప అనే సినిమా చేస్తున్నాడు...

శరవేగంగా అల్లు అర్జున్ మూవీ షూటింగ్.. ప్రీరిలీజ్ ముందే భారీ ధరకు పుష్ప నైజాం హక్కులు..?

Updated on: Jan 31, 2021 | 8:21 AM

Allu Arjun “Pushpa” : అల్లు అర్జున్ పుష్పరాజ్ గా అలరించాడని సిద్దమవుతున్న విషయం తెలిసిందే.. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. గంధపు చక్కల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.  అందాల భామ రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్రయూనిట్. ఈ ఏడాది ఆగష్టు 13న పుష్ప మూవీ విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసారు.

సుకుమార్ దర్శకత్వంలో ఆర్య, ఆర్య 2 సినిమాలతో హిట్లు అందుకున్న బన్నీ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టబోతున్నాడని అభిమానులంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. టీజర్, ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ విడుదల హక్కులను భారీ ధరలకు బిజినెస్ చేస్తోందని తెలుస్తుంది. ప్రీరిలీజ్ ముందే పుష్ప నైజాం హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యానని వార్తలు వస్తున్నాయి. పుష్ప నైజాం హక్కులు 40కోట్లకు అమ్ముడయినట్లు ఫిలిం నగర్లో టాక్ నడుస్తుంది. ‘అల వైకుంఠపురంలో’ సినిమాలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘పుష్ప’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి: 

Varun Tej: ‘గరుడవేగ’ డైరెక్టర్‌తో చేతులు కలపనున్న మెగాహీరో.. సినిమా షూటింగ్‌ మొత్తం లండన్‌లోనే..