ప్రముఖ దర్శకనిర్మాత, హృతిక్ తాత కన్నుమూత

| Edited By: Pardhasaradhi Peri

Aug 07, 2019 | 2:28 PM

ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత, హీరో హృతిక్ రోషన్ తాత ఓం ప్రకాష్(93) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నటుడు దీపక్ పరష్కర్ సోషల్ మీడియాలో ధ్రువీకరించారు. కాగా 1974లో వచ్చిన ఆస్ కీ పచ్చి అనే చిత్రం ద్వారా నిర్మాతగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆయన, దర్శకుడిగానూ పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించాడు. ‘అజీబ్ దస్తాన్ హై యే’, ‘అగ్నీ’, ‘ఆఖిర్ క్యో, ‘అర్పన్’, […]

ప్రముఖ దర్శకనిర్మాత, హృతిక్ తాత కన్నుమూత
Follow us on

ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత, హీరో హృతిక్ రోషన్ తాత ఓం ప్రకాష్(93) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నటుడు దీపక్ పరష్కర్ సోషల్ మీడియాలో ధ్రువీకరించారు.

కాగా 1974లో వచ్చిన ఆస్ కీ పచ్చి అనే చిత్రం ద్వారా నిర్మాతగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆయన, దర్శకుడిగానూ పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించాడు. ‘అజీబ్ దస్తాన్ హై యే’, ‘అగ్నీ’, ‘ఆఖిర్ క్యో, ‘అర్పన్’, ‘ఆవా’, ‘అప్నపన్’, ‘ఆప్ కీ కసమ్’ వంటి చిత్రాలను నిర్మించి, తెరకెక్కించారు. 2001లో చివరిసారిగా ‘అఫ్సానా దిల్వాలోన్ కా’ అనే చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు ఎక్కువగా ‘అ’ అనే అక్షరంతోనే మొదలవ్వడం విశేషం. అంతేకాదు 1995-96సంవత్సరంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేశారు. మరోవైపు ఓం ప్రకాష్ మృతిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు.