Thor Love and Thunder: అదరగొట్టిన క్రిస్ హేమ్స్ వర్త్.. ఆకట్టుకుంటున్న థోర్: లవ్ అండ్ థండర్ ట్రైలర్

|

May 25, 2022 | 1:54 PM

సూపర్ హీరోల సినిమాకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ హీరోల సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులుంటారు.

Thor Love and Thunder:  అదరగొట్టిన క్రిస్ హేమ్స్ వర్త్.. ఆకట్టుకుంటున్న థోర్: లవ్ అండ్ థండర్ ట్రైలర్
Thor
Follow us on

సూపర్ హీరోల సినిమాకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ హీరోల సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులుంటారు. అందుకే అన్నిభాషల్లో సూపర్ హీరోల సినిమాలు విడుదలవుతు ఉంటాయి. ఇప్పటికే మర్వెల్, డిస్ని మూవీస్ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాయి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇప్పటికే చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వచ్చిన అన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఇటీవలే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి డాక్టర్ స్ట్రేంజ్ మల్టీ యూనివర్స్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు థోర్ లవ్ అండ్ థండర్(Thor Love and Thunder) మూవీ రానుంది.

ఈ మూవీలో  థోర్ గా మరోసారి క్రిస్ హేమ్స్ వర్త్ అలరించనున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీలో థోర్ కి తోడుగా అతని మాజీ లవర్ జేన్ (నటాలీ పోర్ట్ మన్) లేడీ థోర్ గా అలరించింది. ఎండ్ గేమ్ మూవీలో లావుగా మారిన థోర్ ఇప్పుడు మరోసారి తన పాత లుక్ లోకి వచ్చేశాడు. గోర్ ది గాడ్ బుట్చేర్ (క్రిస్టియన్ బాలే) అనే విలన్.. దేవుళ్ళను అంతం చేయాలని అనుకోవడంతో.. థోర్ మళ్ళీ తన ప్రపంచాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. లేడీ థోర్ సహాయంతో థోర్ తన ప్రపంచాన్ని ఎలా కాపాడుకున్నాడనేది ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. థోర్ లవ్ అండ్ థండర్” సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2022 జులై 8న విడుదల కాబోతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sunil : అప్పట్లో రాఘవేంద్ర రావు.. ఇప్పుడు అనిల్ రావిపూడి మాత్రమే.. సునీల్ ఆసక్తికర కామెంట్స్

F3 Movie: డబ్బు విషయంలో వెంకటేష్ ఫిలాసపీ అదుర్స్‌.. ఏమన్నారంటే..