Ron Ely Passed Away: అస్తమించిన టార్జాన్.. అనారోగ్యంతో రాన్ ఎలీ కన్నుమూత

హాలీవుడ్ చిత్రం టార్జాన్ లో తన పాత్రకు ప్రసిద్ధి చెందిన రాన్ ఎలీ కన్నుమూశారు. ఆయనకు 84 ఏళ్లు. ఆయన కుమార్తె కిర్‌స్టెన్ కాసాలే ఆయన మరణం గురించి తెలియజేశారు.

Ron Ely Passed Away: అస్తమించిన టార్జాన్.. అనారోగ్యంతో రాన్ ఎలీ కన్నుమూత
Tarzan
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 24, 2024 | 11:11 PM

హాలీవుడ్ చిత్రం టార్జాన్ లో తన పాత్రకు ప్రసిద్ధి చెందిన రాన్ ఎలీ కన్నుమూశారు. ఆయనకు 84 ఏళ్లు. ఆయన కుమార్తె కిర్‌స్టెన్ కాసాలే ఆయన మరణం గురించి తెలియజేశారు. ఆయన సెప్టెంబర్ 29న కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలోని లాస్ అలమోస్‌లోని తన ఇంటిలో కన్నుమూశారు. కిర్‌స్టన్ తన తండ్రికి నివాళులర్పిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా ఆయన మృతికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. గత కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం.

రాన్ ఈలీ 1960ల NBC సిరీస్ టార్జాన్‌లో ప్రధాన పాత్ర పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తర్వాత 2001లో నటనకు స్వస్తి చెప్పి రచన వైపు మళ్లారు. ఆయన రెండు మిస్టరీ నవలలు రాశారు. టార్జాన్‌లో అతని ప్రసిద్ధ పాత్ర మంచి ఆదరణ పొందింది. నటుడు , రచయిత, అతను గురువుగా కూడా చాలా మంది అభిమానం సొంతం చేసుకున్నాడు.

‘ప్రపంచం చూసిన గొప్ప వ్యక్తుల్లో ఒకరిని కోల్పోయాను, నాన్న. ఆయన నటుడు, రచయిత, కోచ్, కుటుంబ వ్యక్తి, గొప్ప నాయకుడు. ఇతరులపై ఇంత ప్రభావం చూపే వ్యక్తిని నేను ఎప్పుడూ కలవలేదు. ఆయనలో ఏదో మ్యాజిక్ ఉంది’ అని కిర్‌స్టన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!