బ్యాట్మన్ పాత్రకు తన గాత్రంతో ప్రాణం పోసిన హాలీవుడ్ నటుడు కెవిన్ కాన్రాయ్ కన్నుమూశారు. కేవలం బ్యాట్మన్ యానిమేటెడ్ సిరీస్ మాత్రమే కాకుండా అనేక టీవీ షోలు.. చలనచిత్రాలు.. అర్ఖామ్ నైట్.. అర్ఖామ్ సిటీ వంటి కంప్యూటర్ గేమ్స్ కు వాయిస్ అందించారు. డీసీ కామిక్స్ లో బ్యాట్మన్ కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఆ క్యారెక్టర్ ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ చేసిన వ్యక్తి కెవిన్. ఐయామ్ వెన్జెన్స్.. ఐ యామ్ ది నైట్.. ఐ యామ్ బ్యాట్మన్ అంటూ అతను చెప్పిన డైలాగ్స్ ఆడియన్స్‌కు ఆకట్టుకున్నాయి. గత కొద్ది రోజులుగా పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 66 సంవత్సరాలు . న్యూయార్క్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లుగా శుక్రవారం వార్నర్ బ్రదర్స్ సంస్థ ప్రకటించింది. కెవిన్ కాన్రాయ్ మృతితో హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదచాయలు అలుముకున్నాయి. సినీ ప్రేక్షకులు, ప్రముఖులు కెవిన్ మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
వాయిస్ ఆర్టిస్ట్‌గా ప్రసిద్ధి చెందినప్పటికీ, కెవిన్ తన కెరీర్‌ను 80లలో లైవ్-యాక్షన్ యాక్టర్‌గా ప్రారంభించాడు. అతని మొదటి ప్రదర్శన సోప్ ఒపెరా అనదర్ వరల్డ్. 992లో అతను మొదటిసారిగా బ్యాట్‌మాన్ పాత్రకు వాయిస్ అందించాడు. కామిక్స్ పోర్షన్ తర్వాత 1992-96 మధ్య బ్యాట్ మన్ సీరిస్ లు విపరీతంగా జనాదరణను సంపాదించుకున్నాయి. అందులో దాదాపు 15 చిత్రాలు.. 400 టీవీ ఎపిసోడ్స్.. 20కి పైగా వీడియోగేమ్స్ బ్యాట్ మన్ ఆర్ఖాన్ అండ్ ఇన్ జస్టిస్ ఫ్రాంచై జీలకు వాయిస్ అందించారు.
Thank you. ?❤️ pic.twitter.com/hB4XUy8Gw1
— Batman (@Batman) November 11, 2022
DC is deeply saddened at the passing of Kevin Conroy, a legendary actor and the voice of Batman for multiple generations. He will be forever missed by his friends, family, and fans. https://t.co/GgdfYvoKVL pic.twitter.com/pSy8h29h6r
— DC (@DCComics) November 11, 2022
2019లో కెవిన్ చివరకు లైవ్-యాక్షన్ ప్రాజెక్ట్‌లో బాట్‌మ్యాన్‌గా నటించాడు. అతను ఆరోవర్స్ క్రాస్‌ఓవర్ ఈవెంట్ క్రైసిస్ ఆన్ ఇన్ఫినైట్ ఎర్త్స్‌లో పాత బ్రూస్ వేన్ ప్రత్యామ్నాయ వెర్షన్‌ను చిత్రీకరించాడు.