Titanic: ఓడ ఖరీదు 47 కోట్లు.. సినిమా ఖర్చు1250 కోట్లు.. పాతిక వసంతాల టైటానిక్‌ గురించి ఆసక్తికర విషయాలివే

సరిగ్గా పాతికేళ్ళ క్రితం అంటే 1997 డిసెంబర్ 19న విడుదలై ప్రపంచవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా ప్రతి ప్రేక్షకుడి హృదయాన్నీ కదిలించిన సినిమా టైటానిక్. 11 ఆస్కార్ అవార్డులు ఈ సినిమా గొప్పతనాన్ని చెప్పడానికి ఓ గీటురాయి మాత్రమే.

Titanic: ఓడ ఖరీదు 47 కోట్లు.. సినిమా ఖర్చు1250 కోట్లు.. పాతిక వసంతాల టైటానిక్‌ గురించి ఆసక్తికర విషయాలివే
Titanic Movie

Updated on: Dec 20, 2022 | 6:52 PM

సినిమా అంటేనే ఏదో తెలియని మాయ. తీసేవాళ్ల దగ్గర నుంచి చూసేవాళ్ల వరకూ ఆ మాయతో ప్రేమలో పడిపోతారు. చరిత్రలో ఎన్నో అద్భుత సినిమాలు వచ్చాయి. చరిత్రనే అదరిపోయేవిధంగా ప్రజల ముందుకు తీసుకువచ్చిన సినిమాలూ వచ్చాయి. కొన్ని సినిమాలు చరిత్ర నుంచి కథలుగా పుట్టుకొచ్చి చరిత్ర సృష్టించాయి. పేరు తలుచుకుంటేనే మనసును స్పందింపచేసేలా తెరకెక్కిన అలాంటి దృశ్య కావ్యం.. టైటానిక్. సరిగ్గా పాతికేళ్ళ క్రితం అంటే 1997 డిసెంబర్ 19న విడుదలై ప్రపంచవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా ప్రతి ప్రేక్షకుడి హృదయాన్నీ కదిలించిన సినిమా టైటానిక్. 11 ఆస్కార్ అవార్డులు ఈ సినిమా గొప్పతనాన్ని చెప్పడానికి ఓ గీటురాయి మాత్రమే. కానీ, సినిమా కథ వెనుక ఉన్న కథను పరిచయం చేయడానికి అప్పట్లో చేసిన ప్రయత్నం ఖర్చు 1250 కోట్ల రూపాయలు. 3 గంటల పదినిమిషాల రన్ టైమ్ ఈ హాలీవుడ్ సినిమాది. అంటే నిమిషం సినిమాకు 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.

కోటి లీటర్ల నీటితో..

ఖర్చు పెట్టడానికేముంది ఎంతైనా పెట్టేయవచ్చు. పెట్టిన ప్రతి రూపాయినీ తెరపై అద్భుతంగా ఆవిష్కరించడం కొన్ని సినిమాలకే సాధ్యం. అందులో మొదటి వరుసలో కచ్చితంగా ఉండే సినిమా టైటానిక్. పాతికేళ్లనాటి టైటానిక్ సినిమాకు 1912 లో సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ కథ ఆధారం. అప్పట్లో మునిగిపోయిన ఆ షిప్ ఖరీదు 47 కోట్ల రూపాయలు. దాని ఆధారంగా నిర్మించిన టైటానికి సినిమా ఖర్చు దీనికంటే 26 రెట్లు ఎక్కువ. ఇలా పాతికేళ్ల క్రితమే ప్రపంచ సినీ ప్రేమికులను తన మాయతో ప్రేమలో పడిపోయేలా చేసిన దిగ్గజ దర్శకుడు జేమ్స్ కెమెరాన్. అసలు టైటానిక్ షిప్ బ్లూ ప్రింట్ ఆధారంగా ఈ సినిమా కోసం మళ్లీ అచ్చంగా అలాంటి షిప్ నిర్మించారు. ఈ సినిమా మొత్తానికి ఆయువుపట్టు అయినటువంటి షిప్ సముద్రంలో మునిగిపోయే దృశ్యాల కోసం కేవలం ఒక సన్నివేశంలో 1 కోటి లీటర్ల నీటిని ఉపయోగించారు. అయితే ఇతర సన్నివేశాలలో లక్షల కొద్దీ లీటర్ల నీటిని ఉపయోగించారు.

26 రెట్లు ఎక్కువ

1995లో, మునిగిపోయిన టైటానిక్ ఫుటేజీని తీయడానికి జేమ్స్ కామెరూన్ 12 సార్లు 12వేల500 అడుగుల లోతులో మునిగిపోయాడు. బలమైన నీటి ఒత్తిడి మధ్య జట్టు లోతుల్లోకి దిగింది. ఈ ప్రమాదకర ఒత్తిడిలోనే ఫుటేజీ కోసం సినిమా టీమ్ ఎంతో ప్రయాస పడింది. 1997 డిసెంబర్ 19న విడుదలై ఐకానిక్ ఫిల్మ్ టైటానిక్ 25 ఏళ్లు పూర్తయ్యాయి. 11 ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న ఈ సినిమా అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సినిమాగా నిలిచింది. 1912లో సౌతాంప్టన్ నుండి తన తొలి, చివరి సముద్రయానంలో ఈ చిత్రం RMS టైటానిక్‌లో బయలుదేరింది. ఈ ఎపిక్ రొమాన్స్ అండ్‌ ట్రాజెడీ ఫిల్మ్ ఖర్చు అసలు టైటానిక్ షిప్ కంటే 26 రెట్లు ఎక్కువ. అవతార్, ది టెర్మినేటర్ వంటి గొప్ప చిత్రాలను రూపొందించినందుకు పేరుగాంచిన జేమ్స్ కామెరూన్ ఈ చిత్రానికి రచయిత దర్శకుడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..