Godzilla x Kong: ఈసారి మరింత ఆసక్తికరంగా.. గాడ్జిల్లా అండ్ కాంగ్: ఓ నూతన సామ్రాజ్యం.. ట్రైలర్ అదిరిపోయిందిగా

మార్వెల్స్, డిస్ని మూవీస్ కు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికి తెలుసు. అలాగే అవతార్ లాంటి సినిమా రికార్డ్ కూడా క్రియేట్ చేశాయి మనదగ్గర. వీటితో పటు కింగ్ కాంగ్ సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కింగ్ కాంగ్ కు సంబంధించిన ఇప్పటికే చాలా పార్ట్స్ వచ్చాయి. కింగ్ కాంగ్, గాడ్జిల్లా సినిమాలకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు.

Godzilla x Kong: ఈసారి మరింత ఆసక్తికరంగా.. గాడ్జిల్లా అండ్ కాంగ్: ఓ నూతన సామ్రాజ్యం.. ట్రైలర్ అదిరిపోయిందిగా
Godzilla X Kong

Updated on: Dec 04, 2023 | 8:10 AM

హాలీవుడ్ సినిమాలకు అన్ని భాషల్లో మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఫాంటసీ సినిమాలకు మన దగ్గర మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే మార్వెల్స్, డిస్ని మూవీస్ కు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికి తెలుసు. అలాగే అవతార్ లాంటి సినిమా రికార్డ్ కూడా క్రియేట్ చేశాయి మనదగ్గర. వీటితో పటు కింగ్ కాంగ్ సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కింగ్ కాంగ్ కు సంబంధించిన ఇప్పటికే చాలా పార్ట్స్ వచ్చాయి. కింగ్ కాంగ్, గాడ్జిల్లా సినిమాలకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఈ రెండు భారీ జంతువులను కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ తెరక్కేక్కిన విషయం తెలిసిందే..

గతంలో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అనే టైటిల్ తో ఓ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అన్ని భాషల్లో రిలీజ్ అయినా ఈ సినిమాకు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. జడ్జిల్లా, కింగ్ కాంగ్ కాంబినేషన్ లో మరో సినిమా రానుంది. గాడ్జిల్లా అండ్ కాంగ్: ఓ నూతన సామ్రాజ్యం అనే టైటిల్ తో తెలుగులో ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈసారి కింగ్ కాంగ్ తన జాతికి చెందిన మరికొన్ని జంతువులతో పోటీపడాల్సి వచ్చింది. అయితే అవి అధిక సంఖ్యలో ఉండటంతో కాంగ్ ఒక్కటే వాటితో పోరాడలేదు. దానికి గాడ్జిల్లా సాయం అవసరం అని ట్రైలర్ లో చూపించారు. అనుకున్నట్టుగానే కాంగ్, గాడ్జిల్లాతో కలిసి వాటితో పోరాటం చేసింది. ఈ ట్రైలర్ ఇప్పుడు సినిమా పై అంచనాలను పెంచేసింది. ఎప్పటిలానే విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ట్రైలర్ లో కొన్ని సీన్స్ గూస్‌బంప్స్ తెప్పించాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమా ఇంగ్లీష్, తమిళ్, హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.