AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Odyssey: క్రిస్టోఫర్ నోలన్ నయా మూవీ.. ఇండియాలో ది ఒడిస్సీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యేది అప్పుడే

ఇండియాలో క్రిస్టోఫర్ నోలన్‌ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ IMAX. ఈమూవీ అడ్వాన్స్ బుకింగ్స్ జూన్ 8 నుంచి ప్రారంభంకానున్నాయి. జూన్ 8న భారతీయ అభిమానులు ప్రపంచంలోనే మొదటి వారిలో ఒకరిగా సీట్లు బుక్ చేసుకోనున్నారు

The Odyssey: క్రిస్టోఫర్ నోలన్ నయా మూవీ.. ఇండియాలో ది ఒడిస్సీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యేది అప్పుడే
The Odyssey
Rajeev Rayala
|

Updated on: Jun 05, 2026 | 5:04 PM

Share

ఇండియాలో హాలీవుడ్ సినిమాల క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో హాలీవుడ్ సినిమాలు తెలుగుతో పాటు ఇండియాలోని ఇతరభాషల్లోనూ విడుదలై సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు మన తెలుగు సినిమాలు కూడా హాలీవుడ్ లో విడుదలవుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు హాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో హాలీవుడ్ సినిమా మన దగ్గర సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఆ సినిమా మరేదో కాదు. ది ఒడిస్సీ. క్రిస్టోఫర్ నోలన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘ది ఒడిస్సీ’. అకాడమీ అవార్డు విజేత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన మిథిక్ యాక్షన్ ఎపిక్ ‘ది ఒడిస్సీ’ చిత్రం IMAX అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ భారతదేశంలో జూన్ 8, 2026 నుంచి ప్రారంభంకానుంది.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ ప్రతీక్షతో రాబోతున్న ఈ చిత్రం, సినిమా చరిత్రలోనే పూర్తిగా IMAX కెమెరాలతో చిత్రీకరించిన మొదటి ఫీచర్ ఫిల్మ్ కావడం విశేషం. ఆధునిక IMAX ఫిల్మ్ టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించిన ఈ సినిమా, జూలై 17, 2026న భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.హోమర్ రచించిన ఐక్యానిక్ ఎపిక్ ‘ఒడిస్సీ’ని ఇప్పటికిప్పుడు ఎప్పుడూ చూడని విధంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో ఒడిస్సీ పాత్రలో మ్యాట్ డామన్, టెలిమాకస్ పాత్రలో టామ్ హాలండ్, పెనెలోప్ పాత్రలో ఆన్ హాథవే నటిస్తున్నారు. ఇంకా జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్, లుపితా న్యాంగ్‌ఓ, చార్లీజ్ థెరాన్, జాన్ బెర్న్‌తాల్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ డెన్జిల్ డయాస్ మాట్లాడుతూ.. ‘ది ఒడిస్సీ’ సినిమా చరిత్రలోనే పూర్తిగా IMAX కెమెరాలతో చిత్రీకరించిన మొదటి చిత్రం. దీన్ని సాధించడానికి క్రిస్టోఫర్ నోలన్ దాదాపు ఇరవై సంవత్సరాలు కృషి చేశారు. జూన్ 8 నుంచి భారతదేశంలోని నోలన్ అభిమానులు ప్రపంచంలోని ఇతర అభిమానులతో పాటు తమకు నచ్చిన సీట్లను బుక్ చేసుకునే అవకాశం లభించడం చాలా విశేషం. ఇది భారతీయ నోలన్ అభిమానులకు ఎన్నో జ్ఞాపకాలు మిగులుస్తుందని అన్నారు. ది ఒడిస్సీ సినిమా జూన్ 8, 2026 నుంచి IMAX టికెట్లు అందుబాటులో ఉంటాయి. చిత్రం జూలై 17, 2026న భారతదేశంలోని అన్ని ఫార్మాట్లలో విడుదలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us