‘టైటానిక్’ సినిమా అంటే ఇప్పటికీ ఇష్టం ఉండని వారుండరు. అప్పట్లో యావత్ ప్రపంచం సంచలం రేపింది ఆ మూవీ. అంతేకాకుండా ఎంతో మంది ఈ సినిమాను ఇష్టపడుతుంటారు. ఎన్నిసార్లు చూసిన ఇప్పటికీ చూడాలనిపించే సినిమా టైటానిక్. నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా.. సూపర్ రొమాంటిక్ క్లాసికల్ డ్రామాగా తెరకెక్కించాడు ఆ మూవీ డైరెక్టర్ కామెరూన్. ముఖ్యంగా షిప్ మునిగిపోతున్న సమయంలోని సన్నివేశాలు ప్రేక్షకులకు ఎంతో ఆసక్తికరంగా అనిపించాయి. ఇక ఇందులో హీరో నియోనార్డో డికాప్రియో హీరోగా నటించాగా.. కేట్ విన్స్లెట్ హీరోయిన్గా నటించింది. కాగా టైటానిక్ వచ్చి 20 అవుతున్న సందర్భంగా హీరోయిన్ కేట్ విన్స్లేట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ క్రమంలో అమె టైటానిక్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్నే మలుపు తిప్పిన ఈ సినిమా అంటే తనకు అసలు ఇష్టం ఉండదని.. ఇప్పుడు ఈ సినిమా చూడాలంటేనే అసహ్యం వేస్తోందని తెలిపారు. ప్రస్తుతం కేట్ అవతార్ సీక్వెల్లో లీడ్ రోల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మరోసారి డొనాల్డ్ ట్రంప్ సంచలన ట్వీట్… నేనే గెలిచాను అంటూ పోస్ట్..