పవన్‌ హీరోయిన్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..!

| Edited By:

Apr 21, 2020 | 12:25 PM

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ వకీల్‌ సాబ్ మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో విజయం సాధించిన పింక్‌ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. అన్నీ కుదిరి ఉంటే మేలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చేది. అయితే అనుకోకుండా కరోనా లాక్‌డౌన్‌ రావడంతో మూవీ విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. కాగా ఈ మూవీ గురించి, పవన్ కల్యాణ్‌ గురించి దర్శకుడు […]

పవన్‌ హీరోయిన్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..!
Follow us on

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ వకీల్‌ సాబ్ మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో విజయం సాధించిన పింక్‌ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. అన్నీ కుదిరి ఉంటే మేలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చేది. అయితే అనుకోకుండా కరోనా లాక్‌డౌన్‌ రావడంతో మూవీ విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. కాగా ఈ మూవీ గురించి, పవన్ కల్యాణ్‌ గురించి దర్శకుడు వేణు శ్రీరామ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

”పవన్ కల్యాణ్‌ ఉదయం విజయవాడకు వెళ్లేవారు. సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చేవారు. రాత్రి పూట జరిగిన షూటింగ్‌ల్లో ఆయన చాలా ఎనర్జీతో పాల్గొనేవారు. వకీల్‌ సాబ్‌ కోసం పవన్ కల్యాణ్ తప్ప మరెవరు అంత హార్డ్‌వర్క్‌ చేయలేరేమో” అని వేణు శ్రీరామ్ అన్నారు. మాస్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేందుకే వకీల్ సాబ్ అనే టైటిల్ పెట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ సినిమాకు ఇక నెల రోజుల మాత్రమే పని మిగిలిందని.. లాక్‌డౌన్ పూర్తైన తరువాత షూటింగ్ ప్రారంభిస్తామని ఆయన అన్నారు. ఇక ఈ సినిమా నుంచి శ్రుతీ తప్పుకుందన్న వార్తలపై స్పందించిన వేణు శ్రీరామ్‌.. ”ఈ మూవీ నుంచి ఆమె తప్పుకోలేదు. లాక్‌డౌన్ తరువాత డేట్లను ఎలా అడ్జెస్ట్ చేయగలదు అని మేము ఆలోచిస్తున్నాము. ఆమె షూటింగ్‌లో జాయిన్ అయిన తరువాత పవన్‌, శ్రుతీపై ఓ పాటను చిత్రీకరిస్తాం” అని వివరించారు. కాగా ఈ మూవీ ద్వారా పవన్ సరసన మూడోసారి శ్రుతీ జతకట్టబోతోంది.

Read This Story Also: పెళ్లి ఏర్పాట్లు.. ప్రముఖ యాంకర్, మహేష్‌ బంధువుపై కేసు నమోదు..!