జైపూర్: టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత వివాహం ఆదివారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ రాజధాని జయపురలోని ఓ హోటల్‌లో ఆశ్రిత, వినాయక్ రెడ్డిలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇరువురు ప్రేమించుకోవడంతో పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించారు. కాగా వినాయక్ రెడ్డి హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు అన్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్, రామ్‌చరణ్, ఉపాసన, నాగచైతన్య, సమంత తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. త్వరలో హైద్రాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.