గతేడాది ‘శ్రీదేవి సోడా సెంటర్’ తో మిశ్రమ ఫలితాన్ని అందుకున్న సుధీర్ బాబు (Sudheer Babu) మళ్లీ విజయాల బాట పట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం కృతిశెట్టి (KrithiShetty) తో కలసి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో నటిస్తున్న ఈ ట్యాలెంటెడ్ హీరో పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లోనూ నటిస్తున్నాడు. అదేవిధంగా కమెడియన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేశాడు. తాజాగా మరో సినిమాను పట్టాలెక్కించాడు. ఈ క్రమంలో తన 16వ సినిమా విశేషాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. దీంతో పాటు సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు.
తుపాకులు అబద్ధం చెప్పవు..
చుట్టూ తుపాకులు, పోలీస్ స్పెషల్ క్రైమ్స్ డివిజన్ అనే లోగోతో రూపొందించిన ఈ పోస్టర్‌పై ‘గన్స్ డోంట్ లై’ అనే ట్యాగ్ లైన్ ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్ సురపనేని దర్శకత్వం వహిస్తున్నారు. ట్వీట్‌లో నటుడు శ్రీకాంత్ పేరును కూడా ట్యాగ్ చేశాడు సుధీర్ బాబు. దీంతో అతను కూడా ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్, ఇతర తారాగణం, టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే తెలియనున్నాయి. కాగా ‘సమ్మోహనం’, ‘వి’ సినిమాల తర్వాత మళ్లీ మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నటిస్తున్నాడు సుధీర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Super excited for this one ?#Sudheer16 Action Unlimited??@bharathhere @actorsrikanth @imaheshh @vincentcinema @bhavyacreations #anandaprasad @anneravi pic.twitter.com/NZix4covyc
— Sudheer Babu (@isudheerbabu) February 12, 2022
Also Read:IPL 2022 Auction: మొదటి సెట్‌లో అగ్ర తాంబూలం వీరికే.. ఏ జట్టు ఎవరిని దక్కించుకుందో..