Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వరుస సినిమాలతో బిజీగా మారాడు. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాపులతో నెట్టికొచ్చిన సాయి… ఇటీవల విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చాడు. ఈ సినిమా ఉత్సహంతో వరుస ఆఫర్లకు ఓకే చెప్పేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం ఈ మెగా ‘రిపబ్లిక్’ సినిమాలో నటిస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తేజ్ తొలిసారిగా నటిస్తున్న సినిమా ఇది. దేవకట్ట దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాకుండా ఇందులో రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తుంది.
తాజాగా సాయి ధరమ్ మరో సినిమాకు కూడా ఓకే చెప్పినట్లుగా సమాచారం. గతంలో కృష్ణవంశీ దగ్గర పనిచేసిన విజయ్ అనే డైరెక్టర్ చెప్పిన స్టోరీకి సాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్. ప్రస్తుతం తేజు నటిస్తున్న రిపబ్లిక్ మూవీ షూటింగ్ తర్వాత బీవీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో మరో సినిమా చేయనున్నాడు. వరుస సినిమాలు చేస్తూ సాయి ఫుల్ బిజీగా ఉన్నాడు. సాయి నటిస్తున్న రిపబ్లిక్ మూవీ జూన్ 4న థియేటర్లలోకి రానుంది.
Also Read:
నా సినిమాలు చూడటానికి సిగ్గుపడుతుంటాను.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన తమిళ స్టార్ సూర్య..