Nithin: దీపావళి పండుగను ప్రతీ ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. టపాకాయలు, స్వీట్‌లతో ఎంజాయ్ చేశారు. ఇక సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ పండుగను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా హీరో నితిన్ భార్య షాలిని కూడా ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. భర్తతో గడిపిన క్షణాలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.
దీపావళి వేడులకల్లో భాగంగా చిన్న పిల్లలు ఆడుకునే తుపాకీతో టపాసులు పేలుస్తూ భార్య షాలినిని భయపెట్టించాడు. గన్ నుంచి శబ్దం వచ్చినంత సేపు షాలిని కళ్లు, చెవులు మూసుకొని భయపడ్డారు షాలిని. ఓవైపు భార్యను భయపెట్టిస్తూనే మరోవైపు వీడియో తీశాడు నితిన్. దీంతో ఆ వీడియోను కాస్త ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన షాలిని.. ‘అందరికీ హ్యాపీ అండ్ సేఫ్ దీపావళీ’.. కానీ నేను మాత్రం సేఫ్‌గా లేననిపిస్తోంది’ అంటూ క్యాప్షన్ జోడించారు. ఈ పోస్టుకు భర్త నితిన్‌ను కూడా ట్యాగ్ చేశారు షాలిని. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. మరి నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
ఇదిలా ఉంటే నితిన్, షాలినిల వివాహం 2020లో హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగింది. నిజానికి తొలుత వీరి వివాహాన్ని దుబాయ్‌లో జరపాలని అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో విదేశీ ప్రయాణాలపై నిర్బంధం ఉండడంతో హైదరాబాద్‌లోనే జరిపించారు. ఇక నితిన్ కెరీర్ విషయానికొస్తే ఈ యంగ్ హీరో ప్రస్తుతం ‘మాచర్ల నియోజక వర్గం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. నితిన్ చివరిగా నటించిన మాస్ట్రో చిత్రం హాట్‌స్టార్ ఓటీటీ వేదికగా విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో నితిన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
Also Read: Coronavirus: మూగ జీవాల పాలిట ప్రమాదకరంగా మారుతోన్న కరోనా అల్ఫా వెరియంట్.. తొలిసారిగా..
BOI Recruitment: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
BOI Recruitment: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..