Nani: ఆ స్టార్‌ హీరో సినిమా నేను చేసుంటే బాగుండేది.. మనసులో మాట బయటపెట్టిన న్యాచురల్‌ స్టార్‌..

Ante Sundaraniki: శ్యామ్‌సింగరాయ్‌ లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత న్యాచురల్‌ స్టార్‌ నాని (Nani) నటించిన చిత్రం అంటే సుందరానికి (Ante Sundaraniki). మలయాళ బ్యూటీ నజ్రియా నజిమ్‌ (Nazriya Nazim) తొలిసారిగా నేరుగా టాలీవుడ్‌ తెరపై దర్శనమివ్వనుంది.

Nani: ఆ స్టార్‌ హీరో సినిమా నేను చేసుంటే బాగుండేది.. మనసులో మాట బయటపెట్టిన న్యాచురల్‌ స్టార్‌..
Hero Nani

Updated on: Jun 06, 2022 | 8:26 PM

Ante Sundaraniki: శ్యామ్‌సింగరాయ్‌ లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత న్యాచురల్‌ స్టార్‌ నాని (Nani) నటించిన చిత్రం అంటే సుందరానికి (Ante Sundaraniki). మలయాళ బ్యూటీ నజ్రియా నజిమ్‌ (Nazriya Nazim) తొలిసారిగా నేరుగా టాలీవుడ్‌ తెరపై దర్శనమివ్వనుంది. మెంటల్‌ మదిలో, బ్రోచెవారెవరురా వంటి ఫీల్‌గుడ్‌ సినిమాలను తెరకెక్కించిన వివేక్‌ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు కానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన నాని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇంట్లో  నేనే ఫొటోలు తీస్తాను..

ఈ మధ్య ఏదైనా పాత్ర చూసినప్పుడు ఇలాంటి సినిమా చేసుంటే బావుండనిపించిందా అన్న ప్రశ్నకు న్యాచురల్‌ స్టార్‌ స్పందిస్తూ..’ సూర్య నటించిన జైభీమ్ చూసినప్పుడు ఇలాంటి సినిమా నా కెరీర్ లో వుంటే బావుండనిపించింది. అలాగే తెలుగులో ఇలాంటి కథలు రావాలనిపించింది. అలాంటి కథ ఏ హీరోకి వచ్చినా ఓకే.. నాకు వస్తే ఇంకా హ్యాపీ’ అంటూ చెప్పుకొచ్చారు సూర్య. ఇక అంటే సుందరానికి సినిమాలో నజ్రియా ఫొటోగ్రాఫర్ గా కనిపిస్తున్నారు కదా ? మీ ఇంట్లో ఎవరు బెస్ట్ ఫోటోగ్రాఫర్ అన్న ప్రశ్నకు కూడా హిలేరియస్‌గా సమాధానమిచ్చారు నాని ‘ నేనే. ఇంట్లో నా మంచి ఫోటోలు ఎవరూ తీయరు (నవ్వుతూ). మా ఇంట్లో నా ఫోటోలు దాదాపు చెత్తగా వుంటాయి(నవ్వుతూ) కానీ నేను తీసే ఫోటోలు మాత్రం బావుంటాయి’ అని చెప్పుకొచ్చారు నాని.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Special Trains: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అభ్యర్థులకు శుభవార్త.. సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..

Vikram- Amul: విక్రమ్‌ చిత్ర బృందానికి క్రియేటివ్‌గా విషెస్‌ చెప్పిన అమూల్‌.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్న కమల్‌ డూడుల్‌..

ICC Awards: ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయిన ఆటగాళ్లను ప్రకటించిన ఐసీసీ.. లిస్టులో ఎవరెవరున్నారంటే..