కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య (Aishwarya).. తమ వైవాహిక జీవితానికి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టారు. పెళ్లైన 18 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వేర్వేరుగా ప్రకటించారు. కాగా విడాకుల ప్రకటన అనంతరం తమ వ్యక్తిగత పనుల్లో బిజీ అయిపోయారు ధనుష్, ఐశ్వర్య. ఎప్పటిలాగే ధనుష్ తన సినిమా షూటింగుల్లో తలమునకలు కాగా.. డైరెక్షన్‌లో అభనుభవమున్న ఐశ్వర్య కూడా తన తదుపరి ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు జరుపుతోంది. అయితే ఈ మాజీ దంపతులను కలపడానికి ఇద్దరి తరపు కుటుంబీకులు, బంధువులు ప్రయత్నించారని అయినా సఫలం కాలేదని సమాచారం. అందుకు తగ్గట్లే ధనుష్ తండ్రి కస్తూరి రాజా కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ ధనుష్, ఐశ్వర్య త్వరలోనే కలసిపోతారని, ఒక శుభవార్త వింటారని ప్రకటించారు. అయితే అలాంటివేమీ జరగలేదు.
కాగా ప్రస్తుతం ధనుష్ ‘సార్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందుకోసం గత కొన్ని రోజులుగా భాగ్యనగరంలోనే ఉంటున్నాడు ఈ కోలీవుడ్ స్టార్. ఇక ఐశ్వర్య కూడా ఓ పాట షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌లోనే ఉంటుంది.. అయితే ఇద్దరూ ఒకే హోటల్‌లో ఉన్నప్పటికీ ఒకరినొకరు కనీసం మాట్లాడుకోలేదని తమిళ మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇటీవల ధనుష్, ఐశ్వర్యలు ఓ కామన్ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీకి హాజరయ్యారట. చెన్నైలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో గ్రాండ్‌గా ఈ పార్టీ జరిగింది. కాగా పార్టీకి వచ్చిన అతిథులంతా ధనుష్, ఐశ్వర్య మాట్లాడుకుంటారమోనని ఆసక్తిగా ఎదురు చూశారట. అయితే అక్కడ కూడా వారు దూరంగానే ఉన్నారట. కనీసం మాటవరుసకైనా ఒకరినొకరు మాట్లాడుకోలేదట. దీంతో వీరిద్దరూ మళ్లీ కలిసిపోతారన్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని తెలుస్తోంది.
Also Read:జేఈఈ మెయిన్ షెడ్యూల్ విడుదల.. ఎన్టీఏ కీలక నిర్ణయం.. వివరాలివే
పండుగపూట విషాదం.. చెట్టును ఢీ కొట్టిన కారు.. ఆరుగురు మృతి