బన్నీని తప్ప ఎవరినీ చూడలేదు.. ‘అల’ రీమేక్‌లో నటించేందుకు రెడీ: బాలీవుడ్ హీరో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం అల వైకుంఠపురములో. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో ఈ మూవీని మిగిలిన భాషల్లో రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పలు భాషల నిర్మాతలు రీమేక్‌ రైట్స్‌ని కూడా తీసుకున్నారు. కాగా బాలీవుడ్‌లో ఈ సినిమాను రీమేక్‌ చేస్తే ఇందులో నటించేందుకు తాను సిద్ధంగా […]

బన్నీని తప్ప ఎవరినీ చూడలేదు.. అల రీమేక్‌లో నటించేందుకు రెడీ: బాలీవుడ్ హీరో

Edited By:

Updated on: May 28, 2020 | 10:42 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం అల వైకుంఠపురములో. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో ఈ మూవీని మిగిలిన భాషల్లో రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పలు భాషల నిర్మాతలు రీమేక్‌ రైట్స్‌ని కూడా తీసుకున్నారు. కాగా బాలీవుడ్‌లో ఈ సినిమాను రీమేక్‌ చేస్తే ఇందులో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని యువ హీరో కార్తీక్ ఆర్యన్ అన్నారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కార్తీక్ ఆర్యన్.. ”అల వైకుంఠపురములో సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూశా. సినిమా చాలా బావుంది. ఇందులో అల్లు అర్జున్ చాలా బాగా నటించారు. మిగిలిన పాత్రలను పక్కనపెడితే, ఇందులో అల్లు అర్జున్ పాత్రలో నటించేందుకు చాలా ఎదురుచూస్తున్నా. అయితే అల వైకుంఠపురములో రీమేక్‌లో నేను ఉన్నానో, లేదో ఇంకా తెలీదు” అని చెప్పుకొచ్చారు. కాగా ఈ మూవీని హిందీలో రీమేక్‌ చేయబోతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇందులో హీరోలుగా అక్షయ్‌ కుమార్, షాహిద్ కపూర్‌లతో పాటు కార్తీక్ ఆర్యన్ పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే.

Read This Story Also: ఐఐటీ సాధించాలనుకునే గ్రామీణ విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్