Hero Arya: విజయ్ సేతుపతి స్థానంలోకి నటుడు ఆర్య ?.. తెలుగు సినిమాలో కీలక పాత్రలో నటించనున్న..

|

Jan 04, 2021 | 7:43 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో విలన్ ఎవరనేది ఇంకా తెలియడం లేదు. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

Hero Arya: విజయ్ సేతుపతి స్థానంలోకి నటుడు ఆర్య ?.. తెలుగు సినిమాలో కీలక పాత్రలో నటించనున్న..
Follow us on

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో విలన్ ఎవరనేది ఇంకా తెలియడం లేదు. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ మూవీలో అల్లు అర్జున్‏కు విలన్‏గా తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి నటించనున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ కరోనా కారణంగా డేట్స్ కుదరకపోవడంతో పుష్ప చిత్రం నుంచి విజయ్ తప్పుకున్నాడట. మళ్ళీ అల్లు అర్జున్‏కు ధీటైన ప్రత్యర్థిని వెతికే పనిలో పడ్డారట చిత్రయూనిట్. తాజాగా ఆ పాత్రకు సరిపోయే నటుడు దొరికాడని టాక్ వినిపిస్తోంది. తమిళ హీరో ఆర్యను ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఓకే చేశారట. ప్రస్తుతం ఆర్య ఎనిమి సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. దీంతో అల్లు అర్జున్ పుష్ప మూవీలో కూడా ఆర్య పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయనున్నట్లుగా సమాచారం. ఇక ఈ సినిమాలోని ఓ పాటకు బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానిని సెలక్ట్ చేసినట్లుగా అప్పట్లో రూమర్స్ వచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన విలన్ పాత్రలో నటించేదే ఎవరనేది తెలియాలంటే ఇంకా కొన్ని ఆగాల్సిందే.