‘మామ ఇక లేడు’ అన్న మాటకు సుశాంత్ మేనల్లుడి భావోద్వేగ స్పందన

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం ఎంతోమందిని కదిలించింది. చేసింది కొన్ని సినిమాలే అయినా గుర్తుండిపోయే పాత్రల్లో నటించిన ఈ నటుడు ఇలా తనువు చాలిస్తాడని అనుకోలేదంటూ

మామ ఇక లేడు అన్న మాటకు సుశాంత్ మేనల్లుడి భావోద్వేగ స్పందన

Edited By:

Updated on: Jun 18, 2020 | 6:55 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం ఎంతోమందిని కదిలించింది. చేసింది కొన్ని సినిమాలే అయినా గుర్తుండిపోయే పాత్రల్లో నటించిన ఈ నటుడు ఇలా తనువు చాలిస్తాడని అనుకోలేదంటూ సెలబ్రిటీల మొదలు సామాన్యులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు ఆయన ఇలా చేసుకోవడానికి బాలీవుడ్ పెద్దలే కారణమంటూ పలువురు హిందీ ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే సుశాంత్ మరణంపై అతడి 5 సంవత్సరాల మేనల్లుడు భావోద్వేగమైన సమాధానమిచ్చారట. ఈ విషయాన్ని సుశాంత్ పెద్ద సోదరి శ్వేతా సింగ్ క్రితి సోషల్ మీడియాలో వెల్లడించారు.

నా కుమారుడు నిర్వాన్హ్‌కి మామూ ఇక లేడు అని తెలిపినప్పుడు.. ‘మన గుండెల్లో ఎప్పటికీ జీవించి ఉన్నాడుగా’ అని చెప్పాడని శ్వేతా సింగ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని నిర్వాన్హ్ మూడు సార్లు చెప్పినట్లు ఆమె వెల్లడించారు. ‘ఒక 5 సంవత్సరాల చిన్నపిల్లాడే అంత ధైర్యం ఇస్తున్నప్పుడు.. మనమంతా ఎంత ధైర్యంగా ఉండాలి’ అని శ్వేతా పేర్కొన్నారు. ఇక ఈ సందర్భంగా సుశాంత్ ఫ్యాన్స్‌కి ఆమె రిక్వెస్ట్ చేశారు. అభిమానులందరూ శాంతంగా ఉండాలని శ్వేతా కోరారు. అందరి మనసులో సుశాంత్ ఎప్పటికి జీవించి ఉంటాడని పేర్కొన్నారు.

Read This Story Also: కరోనా పరీక్షలు పెంచండి: హైకోర్టు కీలక ఆదేశాలు