Telugu Movies: అదిరిపోయే చిత్రాలతో ఓటీటీలు, థియేటర్లు సిద్దం.. దసరా దద్దరిల్లిపోతుందంతే!

|

Oct 03, 2022 | 6:43 PM

'ఇప్పటిదాకా ఓ లెక్క.. ఈ దసరాకు ఓ లెక్క'. ఓటీటీలు, థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. అవునండీ.. ఈ దసరాకు సినిమాల జాతరే.

Telugu Movies: అదిరిపోయే చిత్రాలతో ఓటీటీలు, థియేటర్లు సిద్దం.. దసరా దద్దరిల్లిపోతుందంతే!
Ott Movies
Follow us on

‘ఇప్పటిదాకా ఓ లెక్క.. ఈ దసరాకు ఓ లెక్క’. ఓటీటీలు, థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. అవునండీ.. ఈ దసరాకు సినిమాల జాతరే. గతంలో ఎన్నడూ లేని విధంగా అదిరిపోయే చిత్రాలు.. అటు థియేటర్లు.. ఇటు ఓటీటీలలోకి రానున్నాయి. మరి థియేటర్లలో.. ఓటీటీలలో రిలీజ్ అయ్యే చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

గాడ్ ఫాదర్:

మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘లూసిఫర్’.. తెలుగు రీమేక్ ఈ ‘గాడ్ ఫాదర్’. చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్, పూరి జగన్నాధ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. దసరా కానుక ఈ చిత్రం అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ది ఘోస్ట్:

అక్కినేని నాగార్జున హీరోగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన చిత్రం ‘ది ఘోస్ట్’. సోనాల్ చౌహాన్ హీరోయిన్ కాగా.. గుల్‌పనాగ్, అనైక సురేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిటైరయిన ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా నాగార్జున ఈ చిత్రంలో పూర్తిస్థాయి యాక్షన్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా అక్టోబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.

స్వాతిముత్యం:

బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా దర్శకుడు లక్ష్మణ్. కె. కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘స్వాతిముత్యం’. కుటుంబ కథా నేపధ్యంలో రూపొందిన ఈ మూవీ అక్టోబర్ 5న విడుదలవుతోంది.

  • ఓటీటీలలో క్యూ కట్టే చిత్రాలివే..

బాక్సాఫీస్ వద్ద బంపర్ వసూళ్లు సాధించిన ‘కార్తికేయ -2’, ‘బింబిసార’ చిత్రాలు దసరా కానుకగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాయి. నిఖిల్, అనుపమ జంటగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ‘కార్తికేయ -2’ అక్టోబర్ 5వ తేదీ నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘బింబిసార’ చిత్రం అక్టోబర్ 7వ తేదీ నుంచి జీ5లో అందుబాటులోకి రానుంది(దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది)

మరోవైపు పంజా వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘రంగరంగా వైభవంగా’ మూవీ ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అటు అక్షయ్ కుమార్ నటించిన ‘రక్షాబంధన్’ అక్టోబర్ 5 నుంచి జీ5లో.. ‘మజా మా’ మూవీ అక్టోబర్ 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు సిద్దమవుతున్నాయి.

అలాగే ‘గాలిపటా2′(కన్నడ) అక్టోబర్ 5వ తేదీ నుంచి జీ5 ఓటీటీలో.. డిస్నీ+హాట్‌స్టార్‌లో అక్టోబర్ 6వ తేదీన ‘ఎక్స్‌పోజ్‌డ్‌'(వెబ్‌సిరీస్‌), అక్టోబర్ 7న ‘ప్రే'(హాలీవుడ్‌) స్ట్రీమింగ్ కానున్నాయి. ‘దర్జా’, ‘ఉనికి’ సినిమాలు అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో అందుబాటులోకి రానున్నాయి. ఇక సోనీలివ్‌లో అక్టోబర్ 5 నుంచి ‘ఈషో’ మూవీ అటు మలయాళం.. ఇటు తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..