‘అవతార్‌’ టైటిల్ నేనే ఇచ్చా.. అందుకే ఆఫర్ వదులుకున్నా

| Edited By:

Jul 30, 2019 | 1:28 PM

జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్‌’ను సినీ ప్రేక్షకులెవరూ అంత ఈజీగా మర్చిపోరు. ఈ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు పది సంవత్సరాలు పూర్తి అవుతున్నా.. అందులోని అద్భుతాలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో మొన్నటివరకు ఈ చిత్రం మొదటిస్థానంలో ఉండేది. అయితే అవేంజర్స్ ఎండ్ గేమ్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఇదంతా పక్కనపెడితే ఈ మూవీలో తనకు ఆఫర్ వచ్చినట్లు చెప్పుకొచ్చాడు బాలీవుడ్ […]

‘అవతార్‌’ టైటిల్ నేనే ఇచ్చా.. అందుకే ఆఫర్ వదులుకున్నా
Follow us on

జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్‌’ను సినీ ప్రేక్షకులెవరూ అంత ఈజీగా మర్చిపోరు. ఈ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు పది సంవత్సరాలు పూర్తి అవుతున్నా.. అందులోని అద్భుతాలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో మొన్నటివరకు ఈ చిత్రం మొదటిస్థానంలో ఉండేది. అయితే అవేంజర్స్ ఎండ్ గేమ్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఇదంతా పక్కనపెడితే ఈ మూవీలో తనకు ఆఫర్ వచ్చినట్లు చెప్పుకొచ్చాడు బాలీవుడ్ నటుడు గోవిందా. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. జేమ్స్ కామెరూన్ తనకు అవతార్‌లో ఆఫర్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు.

‘‘అవతార్‌కు టైటిల్ ఇచ్చింది నేను. అది పెద్ద విజయం సాధించింది. నేను అప్పట్లోనే జేమ్స్ కామెరూన్‌కు చెప్పాను ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని. అలాగే ఈ మూవీ తీసేందుకు దాదాపుగా 7సంవత్సరాలు పట్టొచ్చని కూడా చెప్పాను. అయితే ఈ సినిమా చిత్రీకరణ అంత సమయం పడుతుందని ఎలా చెప్పగలవని నన్ను కామెరూన్ ప్రశ్నించాడు. నేను దానికి స్పందిస్తూ.. మీరు చెప్తున్నది ఊహాతీతం. నా అంచనాల ప్రకారం ఈ మూవీ 8,9 సంవత్సరాల తరువాత విడుదలై పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంటుంది’’ అని చెప్పానని గోవిందా తెలిపాడు.

ఇక ఈ మూవీలో తనకు ఆఫర్ వచ్చిందని.. అయితే 410రోజులు శరీరమంతా పెయింటింగ్ వేసుకోవాలని చెప్పారని.. అది తనకు కష్టమనిపించి వదులుకున్నానని గోవిందా పేర్కొన్నాడు. కాగా అవతార్‌కు సీక్వెల్ ‘అవతార్ 2’ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.