బాలకృష్ణ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్… నర్తనశాలపై ప్రకటన

విజయదశిమికి ముందు విలక్షణమైన వార్తతో తన అభిమానులను అలరించారు నందమూరి నటసింహం బాలకృష్ణ. తన అభిమానులు చిరకాలంగా ఎదురుచూస్తున్న, పలు సందర్భాలలో తనను కోరిన ఓ పనిని దసరా సందర్భంగా చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

బాలకృష్ణ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... నర్తనశాలపై ప్రకటన
Rajesh Sharma

|

Oct 19, 2020 | 5:30 PM

Good News to Balakrishna fans: నట సింహం నందమూరి బాలక‌ష్ణ అభిమానులకు దసరా సందర్భంగా శుభవార్త వినిపించారు. ఈ గుడ్ న్యూస్‌ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు బాలయ్య బాబు. అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న సినిమాను దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలలో తండ్రికి ధీటైన తనయుడిగా, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసుడిగా ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న నట సింహం నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో అపురూప చిత్రం నర్తనశాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన దాదాపు 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా ఈ విజయదశమి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు.

ఈ సినిమాలో ద్రౌపదిగా నటించిన సౌందర్య హఠాన్మరణంతో సినిమాను అప్పట్లో బాలయ్య బాబు పక్కన పెట్టేశారు. ఆ తర్వాత భీమునిగా నటించిన శ్రీహరి కూడా మరణించారు ఈ చిత్రం ఎన్.బి.కె. థియేటర్‌లో శ్రేయాస్ ఈటి ద్వారా అక్టోబర్ 24న విడుదలవుతుంది. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించడానికి నందమూరి బాలకృష్ణ సంకల్పించారు. ఎన్నాళ్ళగానో నర్తనశాల కోసం రూపొందించిన సన్నివేశాలను చూడాలన్న కోరిక ఈ నెల 24 నుండి నెరవేరబోతోంది. ఇది నందమూరి అభిమానులకు, ప్రేక్షకులకు ఒక శుభవార్త.

Also read: వరద బాధితులకు ‘మేఘా‘ సాయం.. సీఎంఆర్ఎఫ్‌కు పదికోట్లు

Also read: హైద‌రాబాద్‌కు రూ. 550 కోట్లు: కేసీఆర్ ప్రకటన

Also read:  ఏపీలో మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ… ఈసారి టాపిక్ ఇదే!

Also read: బహిరంగచర్చకు రెడీ.. బండికి హరీశ్ సవాల్

Also read: కిస్తులు కట్టిన వారికి త్వరలో మోదీ సర్కార్ శుభవార్త!

Also read: మళ్ళీ వర్షగండం… భయపడొద్దన్న కేటీఆర్

Also read: త్వరలో తెలంగాణకు కేంద్ర బ‌ృందం.. వెల్లడించిన కిషన్‌రెడ్డి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu