ఈ ఫోటో తీసింది ఎవరో తెలుసా..
ఒకరు సినిమా ప్రపంచానికి మహా రాణి.. మరొకరు క్రికెట్ రారాజు.. ఈ ఇద్దరికి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా.. ఇంతా కాదు. ఎవరి స్థాయిలో వారు దూసుకుపోతుంటారు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూనే సమయం చిక్కినప్పుడల్లా ఇద్దరు కలిసి సరదాగా గడుపుతుంటారు.

Magical Sunset : ఒకరు సినిమా ప్రపంచానికి మహా రాణి.. మరొకరు క్రికెట్ రారాజు.. ఈ ఇద్దరికి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా.. ఇంతా కాదు. ఎవరి స్థాయిలో వారు దూసుకుపోతుంటారు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూనే సమయం చిక్కినప్పుడల్లా ఇద్దరు కలిసి సరదాగా గడుపుతుంటారు. ప్రస్తుతం అనుష్క శర్మ గర్భవతి అన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో అనుష్క పండండి బిడ్డకు జన్మనివ్వనుంది. మొదటిసారి తల్లిదండ్రులు కాబోతుండటంతో ఆ ఆనందంలో ఉండే అనుభూతిని విరుష్క జంట తెగ ఆస్వాదిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ 2020లో భాగంగా విరాట్ కోహ్లీ దుబాయ్‌లో ఉండగా ఆయన సతీమణి అనుష్క కూడా అక్కడే ఉన్నారు.
ఇదిలావుంటే.. ఎప్పుడు తన ఫ్యాన్స్‌తో క్లోజ్‌గా ఉండే బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఓ అద్భుతమైన ఫోటోను షేర్ చేశాడు. అనుష్కశర్మతో కలిసి దిగిన ఫొటోను తన ప్యాన్సుతో పంచుకున్నాడు. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో నీటిలో వాళ్లిద్దరూ ఒకరినొకరు చూసుకుంటుండగా తీసిన ఫోటోను పోస్ట్ చేశాడు. సరిగ్గా వారికి వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ కోటలాంటి నిర్మాణం చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మధుర జ్ఞాపకాన్ని తన సహచర ఆటగాడు ఏబీ డివిలియర్స్ తీసినట్లు కోహ్లీ పేర్కొన్నాడు.
❤️? pic credit – @ABdeVilliers17 pic.twitter.com/YhCqV9qGlE
— Virat Kohli (@imVkohli) October 18, 2020
దీనికి సంద్యా సమయానా ప్రేమతో.. అన్న అర్థం వచ్చేలా రెడ్ లవ్, సూర్యాస్తమం సింబల్‌ను జత చేశాడు కోహ్లీ . కాగా ఈ ఫోటో అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తుంది. విరుష్క కపూల్ చాలా అందంగా, చూడ ముచ్చటగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.
.@AnushkaSharma cheering for @imVkohli post his half century against CSK and Virat dedicating his half century to Anushka today ? #Virushka pic.twitter.com/nhj8Y8ypyz
— Anushka Sharma FC™ (@AnushkaSFanCIub) October 10, 2020




