Ghani Movie: బావ కోసం రంగంలోకి దిగుతోన్న బామ్మర్ది.. ‘గని’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌ను ప్రకటించిన చిత్ర యూనిట్..

Ghani Movie: వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'గని'. ఎఫ్‌2, గద్దల కొండ గణేశ్‌ వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌ తర్వాత వరుణ్‌ తేజ్‌ నటిస్తోన్న సినిమా కావడంతో గనిపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్లుగానే దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి ఈ సినిమాను భారీగా...

Ghani Movie: బావ కోసం రంగంలోకి దిగుతోన్న బామ్మర్ది.. గని ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌ను ప్రకటించిన చిత్ర యూనిట్..
Ghani Movie

Updated on: Mar 29, 2022 | 4:40 PM

Ghani Movie: వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గని’. ఎఫ్‌2, గద్దల కొండ గణేశ్‌ వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌ తర్వాత వరుణ్‌ తేజ్‌ నటిస్తోన్న సినిమా కావడంతో గనిపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్లుగానే దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి ఈ సినిమాను భారీగా తెరకెక్కిస్తున్నాడు. అల్లు అరవింద్‌ సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో రానుంది. కెరీర్‌లో తొలిసారి వరుణ్‌ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 8న చిత్ర యూనిట్‌ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదల దగ్గరపుడతోన్న క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచే పనిలో పడింది. ఇందులో భాగంగానే సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమైంది.

ఏప్రిల్‌ 2న విశాఖపట్నంలో ‘గని’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఘనంగా నిర్వహించనున్న ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హాజరుకానున్నాడు. గతంలోనూ అల్లు అర్జున్‌ మెగా ఫ్యామిలీకి చెందిన పలువురు హీరోల సినిమా ఈవెంట్స్‌కు గెస్ట్‌గా వచ్చిన విషయం తెలిసిందే. పుష్పతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన బన్నీ ఈవెంట్‌కు హాజరుకానుండడంతో కార్యక్రమం మరింత సందడిగా మారనుందని మేకర్స్‌ భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే గని సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు మళ్లీ అనుకూలంగా మారడంతో సినిమా విడుదలకు మార్గం సుగుమమైంది. గని సినిమాలో వరుణ్‌కు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ సాయి మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వరుణ్‌కు తల్లిగా నదియా నటింస్తుండగా.. జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్‌ శెట్టి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read: Insurance Alert: గుడ్డిగా తెలిసినవారి దగ్గర ఇన్సూరెన్స్ పాలసీలు కొనకండి.. తరువాత ఈ ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్త..

Food Knowledge: ఎక్స్‏పైరీ డేట్ లేని ఆహార పదార్థాలు ఎంటో తెలుసా.. తేనే నుంచి బియ్యం వరకు..

Shocking News: అదో మిస్టరీ.. తిరుగుతూ.. తిరుగుతూ రైలు కింద పడ్డ కానిస్టేబుల్.. అసలు ఏం జరిగిదంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us