అల్లు అర్జున్ తొలి చిత్రం ‘గంగోత్రి’లోని ‘వల్లంకి పిట్ట’ పాట ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. ఇక పాట గుర్తొచ్చినప్పుడల్లా అందులో నటించిన పాప అందరికీ గుర్తొస్తుంది. ఆ పాట ఎంత ఫేమసో.. పాటలో కనిపించిన చిన్నారి పాప కూడా అంతే ఫేమస్. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్న ఆ చిన్నారి ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా విడుదలైన మసూద అనే సినిమాలో హీరోయిన్‌గా నటించిన కావ్య కల్యాణ్ రామ్‌నే.. గంగోత్రి’లోని ‘వల్లంకి పిట్ట’ పాటలో కనిపించిన ఆ చిన్నారి. ఈమె మన తెలుగు అమ్మాయే.
గంగోత్రితో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెరకు పరిచయమైన కావ్య కళ్యాణ్ రామ్.. ఆ తర్వాత చిరంజీవి ‘ఠాగూర్’, నాగార్జున ‘స్నేహమంటే ఇదేరా’, పవన్ కళ్యాణ్ ‘బాలు’.. లాంటి దాదాపు 16 సినిమాల్లో బాలనటిగా నటించి మెప్పించింది. అనంతరం చదువు కోసం సినిమాలకు దూరమై.. ‘లా’ డిగ్రీ పూర్తి చేసింది. ఇక తాజాగా ‘మసూద’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులో కావ్య అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. అటు ‘ఉస్తాద్’ సినిమాలో కూడా కావ్య హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.