అందుకే నగ్నంగా నటించేందుకు ఒప్పుకున్నా: అల్లరి నరేష్

ఓ వైపు కామెడీ సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు వైవిధ్య పాత్రల్లో నటిస్తుంటారు అల్లరి నరేష్. ఈ క్రమంలో ఇప్పటికే పలు డిఫరెంట్ పాత్రల్లో నటించిన ఈ నటుడు తన తాజా చిత్రం 'నాంది'లో తనలోని మరో యాంగిల్‌ని చూపించబోతున్నారు

అందుకే నగ్నంగా నటించేందుకు ఒప్పుకున్నా: అల్లరి నరేష్

Edited By:

Updated on: Jun 30, 2020 | 3:35 PM

ఓ వైపు కామెడీ సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు వైవిధ్య పాత్రల్లో నటిస్తుంటారు అల్లరి నరేష్. ఈ క్రమంలో ఇప్పటికే పలు డిఫరెంట్ పాత్రల్లో నటించిన ఈ నటుడు తన తాజా చిత్రం ‘నాంది’లో తనలోని మరో యాంగిల్‌ని చూపించబోతున్నారు. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్‌ మేకప్‌ లేకుండా నటించడంతో పాటు కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా కనిపించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే లుక్ విడుదల అవ్వడంతో పాటు టీజర్‌లోనూ ఆ సన్నివేశాన్ని చూపించారు. అయితే ఇలాంటి సన్నివేశాల్లో నటించాలంటే ఏ నటుడికైనా కాస్త ఇబ్బందే. అందులోనూ తెలుగులో ఇంతవరకు ఏ  స్టార్‌ నటుడు ఇంతటి సాహసం చేయలేదు. ఇక అల్లరి నరేష్ ఈ సాహసం చేయగా.. లుక్‌తో పాటు టీజర్‌పై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి.

కాగా ఈ సినిమా కథ వాస్తవానికి చాలా దగ్గరగా ఉందని, అందుకే నగ్నంగా నటించేందుకు ఒప్పుకున్నానని అన్నారు అల్లరి నరేష్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నరేష్.. ”నాంది ఓ థ్రిల్లర్ మూవీ. ఓ అమాయకపు వ్యక్తి ఎలాంటి నేరం చేయకుండానే అరెస్ట్ అవుతాడు. ఆ తరువాత అతడిలో, అతడి కుటుంబంలో ఎలాంటి మార్పులు జరిగాయి అన్నది నాందిలో చూపించబోతున్నాం. ఇది వాస్తవానికి దగ్గరగా ఉన్న సినిమా. అందుకే నగ్నంగా నటించేందుకు ఒప్పుకున్నా” అని చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రానికి విజయ్‌ కనకమేడల అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించగా.. ప్రముఖ దర్శకుడు సతీష్ వేగెష్న నాందిని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి మరో షెడ్యూల్‌ మాత్రమే మిగిలి ఉండగా.. త్వరలోనే ఆ షూటింగ్‌ను పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అల్లరి నరేష్‌ ఇవాళ‌ 38వ పుట్టినరోజును జరుపుకుంటుండగా.. నెట్టింట ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.