Pushpa 2: తగ్గేదే లే.. ఫిలింఫేర్ అవార్డుల్లో పుష్ప హవా.. పోటిపడిన సూర్య..

|

Oct 10, 2022 | 9:53 AM

తెలుగులో ఉత్తమ చిత్రంగా పుష్ప నిలవగా.. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, నటుడిగా అల్లు అర్జున్ అవార్ట్స్ అందుకున్నారు. అలాగే లవ్ స్టోరీ చిత్రానికి గానూ సాయి పల్లవి ఉత్తమ నటిగా అవార్టు సొంతం చేసుకుంది.

Pushpa 2: తగ్గేదే లే.. ఫిలింఫేర్ అవార్డుల్లో పుష్ప హవా.. పోటిపడిన సూర్య..
Film Fare 2022
Follow us on

సౌత్ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిలింఫేర్ అవార్డ్స్ (2022) ఆదివారం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‏లో జరిగింది. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళ చిత్రపరిశ్రమలో అత్యత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు.. ఉత్తమ చిత్రాలకు ఈ అవార్డులను అందించారు. అయితే ఈ ఏడాది పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప ది రైజ్.. ఫిలంఫేర్ అవార్డులలో సత్తా చాటింది. ఏకంగా ఏడు కెటగిరీలలో అవార్డులు సొంతం చేసుకుంది. ఈ సినిమాతోపాటు.. తమిళ్ స్టార్ సూర్య నటించి సూరరై పొట్రు చిత్రం కూడా ఏడు అవార్డులు అందుకుంది. అలాగే దివంగత కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‏కు ఈ సంవత్సరం ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం లభించింది.

తెలుగులో ఉత్తమ చిత్రంగా పుష్ప నిలవగా.. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, నటుడిగా అల్లు అర్జున్ అవార్ట్స్ అందుకున్నారు. అలాగే లవ్ స్టోరీ చిత్రానికి గానూ సాయి పల్లవి ఉత్తమ నటిగా అవార్టు సొంతం చేసుకుంది.

ఫిలింఫేర్ అవార్డ్స్.. తెలుగు చిత్రపరిశ్రమ..

ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ నటి – సాయి పల్లవి (లవ్ స్టోరీ)
ఉత్తమ చిత్రం – పుష్ప: ది రైజ్
ఉత్తమ దర్శకుడు – సుకుమార్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ సహయనటుడు.. మురళీశర్మ (అల వైకుంఠపురంలో)
ఉత్తమ సహాయ నటి – టబు (అల వైకుంఠపురములో)
విమర్శకుల ఉత్తమ నటుడు – నాని (శ్యామ్ సింఘ రాయ్)
విమర్శకుల ఉత్తమ నటి – సాయి పల్లవి (శ్యామ్ సింఘ రాయ్)
ఉత్తమ సాహిత్యం – సీతారామ శాస్త్రి (జాను.. లైఫ్ ఆఫ్ రామ్..)
ఉత్తమ నేపథ్య గాయకుడు – సిద్ శ్రీరామ్ (పుష్ప: ది రైజ్ ) శ్రీవల్లి సాంగ్
ఉత్తమ నేపథ్య గాయని – ఇంద్రావతి చౌహాన్ (పుష్ప: ది రైజ్ ) ఊ అంటావ
ఉత్తమ కొరియోగ్రాఫర్ – శేఖర్ మాస్టర్ (అల వైకుంటపురంలో)
ఉత్తమ సినిమాటోగ్రఫీ – మిరోస్లా కుబా బ్రోజెక్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ నూతన నటుడు – వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)
ఉత్తమ నూతన నటి – కృతి శెట్టి (ఉప్పెన)
లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు – అల్లు అరవింద్

ఫిలింఫేర్ అవార్డ్స్.. తమిళం..

ఉత్తమ చిత్రం – జై భీమ్
ఉత్తమ నటుడు – సూర్య( సూరరై పొట్రు )
ఉత్తమ నటి – లిజోమోల్ జోస్ ( జై భీమ్)
ఉత్తమ దర్శకురాలు – సుధా కొంగర (సూరరై పొట్రు)
ఉత్తమ సహాయ నటుడు – పశుపతి (సర్పత్త పరంబరై )
ఉత్తమ సహాయ నటి – ఊర్వశి (సూరరై పొట్రు)
ఉత్తమ సంగీత దర్శకుడు – జివి ప్రకాష్ కుమార్ (సూరరై పొట్రు )
ఉత్తమ నేపథ్య గాయకుడు – క్రిస్టీన్ జోస్ , గోవింద్ వసంత (సూరరై పొట్రు) “ఆగసం”
ఉత్తమ నేపథ్య గాయని – స్త్రీ – సూరరై పొట్రు నుండి “కాట్టు పాయలే” కొరకు ఢీ
ఉత్తమ సాహిత్యం – అరివు (సర్పత్త పరంబరై) “నీయే ఓలి”
ఉత్తమ కొరియోగ్రఫీ – దినేష్ కుమార్ (మాస్టర్) “వాతి కమింగ్”
ఉత్తమ సినిమాటోగ్రఫీ – నికేత్ బొమ్మిరెడ్డి (సూరరై పొట్రు)